News June 29, 2024

సైకిల్‌పై.. అయోధ్య నుంచి మహానందికి

image

ఢిల్లీకి చెందిన రాజేంద్ర శర్మ సైకిల్‌పై మహానందికి చేరుకున్నారు. వస్త్ర దుకాణంలో పనిచేసే ఆయన చిన్నప్పటి నుంచే హిందూ ధర్మం పట్ల ఆకర్షితుడై సైకిల్‌పై సంపూర్ణ భారత్ యాత్ర చేయాలని సంకల్పించాడు. ఈ ఏడాది మార్చి 13న అయోధ్య నుంచి సైకిల్ యాత్ర మొదలు పెట్టాడు. 7 రాష్ట్రాలను దాటుకుంటూ ఏపీకి చేరాడు. అందులో భాగంగా మహానంది చేరుకున్నారు. మహానందీశ్వర స్వామివారిని దర్శించుకుని అహోబిలం, తిరుపతికి వెళ్తానని చెప్పారు.

Similar News

News July 3, 2024

నంద్యాల: విధుల్లో ఉండగానే టీచర్ మృతి

image

విధుల్లో ఉన్న ఉపాధ్యాయుడు ఒక్కసారిగా కుప్పకూలి మంగళవారం మృతిచెందారు. ఆత్మకూరులో నివాసముంటున్న జీ.నాగలక్ష్మయ్య(58) కొత్తపల్లి మండలం కొత్తమాడుగుల ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నారు. భోజన విరామ సమయంలో ఉన్నఫళంగా ఛాతిలో నొప్పి రావడంతో కుప్పకూలిపోయారు. అపస్మారక స్థితిలో ఉన్న ఉపాధ్యాయుడిని తోటి ఉపాధ్యాయులు ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

News July 3, 2024

కర్నూలు: హిజ్రాలకు గుర్తింపు కార్డులు

image

కర్నూలు జిల్లాలో నివాసం ఉంటున్న హిజ్రాలకు ధ్రువపత్రాలు, గుర్తింపు కార్డులను అందించేందుకు చర్యలు చేపట్టినట్లు విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు రయిస్ ఫాతిమా తెలిపారు. ఇప్పటి వరకు వాటిని పొందని వారు http://transgender.dosje.gov.inలో ఆధార్ కార్డు, నోటరీ అఫిడవిట్ పొందుపరిస్తే కలెక్టర్ ద్వారా ధ్రువపత్రాలు, గుర్తింపు కార్డులను అందిస్తామన్నారు.

News July 3, 2024

నంద్యాల నూతన కలెక్టర్ ప్రస్థానం

image

నంద్యాల జిల్లా నూతన కలెక్టర్‌గా బీ.రాజకుమారి నియమితులయ్యారు. శ్రీకాకుళం (D) టెక్కలి మండలం కొల్లివలస ఆమె స్వస్థలం. 2009 గ్రూప్‌-1 అధికారి అయిన ఈమె విజయనగరం ఆర్డీవోగా ఎంపికయ్యారు. 2013లో సింహాచలం దేవస్థానం స్పెషల్ డీసీగా, 2017లో తూ.గోలో డ్వామా పీడీగా, 2019లో అదే జిల్లాకు JC(వెల్ఫేర్)గా పని చేశారు. 2021లో IAS హోదా పొందారు. ప్రస్తుతం గుంటూరు JCగా ఉన్న ఈమె నంద్యాల కలెక్టర్‌గా బదిలీ అయ్యారు.