News June 29, 2024

శ్రీకాకుళం: మీ కొత్త MLA నుంచి ఏం ఆశిస్తున్నారు?

image

శ్రీకాకుళం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు బాధ్యతలు చేపట్టారు. కూటమి సర్కారులో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఏం పనులు చేస్తారోనని ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆయా ఎమ్మెల్యేలు ఫోకస్​పెట్టాల్సిన అభివృద్ధి పనులు చాలానే ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో అసంపూర్తిగా నిలిచిన పనులను పూర్తి చేయాల్సి ఉంది. మరి మీ MLA నుంచి ఏం ఆశిస్తున్నారు? మీ నియోజకవర్గంలో సమస్యలేంటి? కామెంట్ చేయండి.

Similar News

News July 5, 2024

శ్రీకాకుళం: జాబ్ మేళా.. 16 మంది ఎంపిక

image

శ్రీకాకుళం నగరంలోని స్థానిక ప్రభుత్వ ఐటిఐ కళాశాలలో జిల్లా ఉపాధి అధికారి సుధా ఆధ్వర్యంలో శుక్రవారం మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాలో ఓ ప్రైవేట్ కంపెనీ యాజమాన్యం ఇంటర్వ్యూలు నిర్వహించగా.. నిరుద్యోగ యువత 88 మంది హాజరయ్యారు. ఇందులో 16 మందిని ఎంపిక చేసి, వారికి ఉపాధి కల్పించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి సుధా తెలిపారు.

News July 5, 2024

శ్రీకాకుళం: నేటితో ముగుస్తున్న ఫీజు చెల్లింపు గడువు

image

శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ డిగ్రీ చివరి ఏడాది 5వ సెమిస్టర్ ఇన్స్టంట్ ఎగ్జామ్ ఫీజు చెల్లింపు గడువు నేటితో ముగియనుంది. విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించేందుకు జూన్ 29 నుంచి అవకాశం ఇచ్చారు. ఇప్పటికే ఈ పరీక్షకు అర్హులైన జాబితాను ఆయా కళాశాలలకు అధికారులు అందజేశారు. ఇంకా చెల్లించని విద్యార్థులు నేడు సాయంత్రం లోగా చెల్లించవచ్చని అధికారులు తెలిపారు.

News July 5, 2024

శ్రీకాకుళం: అధికారులు అంకిత భావంతో పనిచేయాలి

image

అధికారులు అంకిత భావంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ జి.ఆర్. రాధిక, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్‌లతో కలిసి జిల్లా అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అర్హత కలిగిన ప్రతీ లబ్ధిదారునికి అందించే దిశగా అంకితభావంతో విధులు నిర్వహించాలని ఆదేశించారు.