News June 29, 2024
తిరుపతి- హిసార్ మధ్య ప్రత్యేక రైలు

తిరుపతి- హిసార్ మధ్య వారానికోసారి ప్రత్యేక రైలు నడపనున్నట్లు ద.మ. రైల్వే అధికారులు తెలిపారు. హిసార్- తిరుపతి (04717) రైలు ప్రతి శనివారం జులై 6 నుంచి సెప్టెంబరు 28వ తేదీ వరకు, తిరుపతి- హిసార్ (04718) రైలు ప్రతి సోమవారం జులై 8 నుంచి సెప్టెంబరు 30వ తేదీ వరకు నడవనున్నాయి. గూడూరు, నెల్లూరు, విజయవాడ, ఖమ్మం, వరంగల్, సిర్పూర్ ఖాఘజ్నగర్, నాగ్పూర్, ఇటార్సీ, భోపాల్ తదితర స్టేషన్ల మీదుగా వెళుతుందని చెప్పారు.
Similar News
News February 5, 2026
చిత్తూరు: నేడు రానున్న 400 టన్నుల యూరియా

జిల్లాలో 2,442 టన్నుల యూరియా నిల్వలున్నాయని జిల్లా వ్యవసాయశాఖ అధికారి మురళి తెలిపారు. రైతు సేవా కేంద్రాల పరిధిలోనే ఈ యూరియాను అధికంగా ఉంచామన్నారు. రైతులకు ఇబ్బంది లేకుండా యూరియా సరఫరా చేస్తున్నట్టు వెల్లడించారు. నేడు(గురువారం) మరో 400 టన్నుల యూరియా రానుందన్నారు. ఆ యూరియాను కూడా రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు అందేలా చూస్తామన్నారు.
News February 5, 2026
చిత్తూరు: నలుగురు అరెస్ట్

చిత్తూరులో పేకాట ఆడుతున్న నలుగురిని బుధవారం రాత్రి 2- టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. యాదమరి జంక్షన్ వద్ద జూదం ఆడుతున్నారని తెలుసుకున్న 2-టౌన్ ఇన్‌స్పెక్టర్ నెట్టికంటయ్య పోలీసు బృందంతో కలిసి ఆకస్మిక దాడులు చేశారు. నిందితులను అరెస్ట్ చేసి, వారి నుంచి సుమారు రూ.4వేల నగదు, పేకాట ముక్కలను స్వాధీనం చేసుకున్నారు.
News February 4, 2026
చిత్తూరు: పోస్టాఫీసులో ఉద్యోగాలు.. APPLY చేసుకోండి.!

చిత్తూరు డివిజనల్ పోస్టాఫీస్ పరిధిలో 23 ఖాళీలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఏబీపీఎం, బీపీఎం, డాక్ సేవక్ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. https://www.indiapost.gov.in/ లో ఈనెల 16 లోపు దరఖాస్తు చేయాలన్నారు. 18 నుంచి 40 సంవత్సరాలలోపు, పదో తరగతి ఉత్తీర్ణత కలిగిన వారు అర్హులన్నారు. ఎస్సీ, ఎస్టీలు, ఓబీసీలు, దివ్యాంగులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుందన్నారు.


