News June 29, 2024

అనంత: లైంగిక వేధింపులకు పాల్పడ్డ వైద్యుడిపై కేసు

image

లైంగిక వేధింపులకు పాల్పడ్డ చెన్నేకొత్తపల్లి మండలం ఎన్ఎస్ గేట్ ప్రభుత్వ ప్రాథమిక వైద్యుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. ముష్టికోవెల ఆరోగ్య ఉప కేంద్రంలో పని చేస్తున్న ఏఎన్ఎం కుమారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఏఎన్‌ఎంలు సుభాషిణి, అశ్విని, కృష్ణమ్మలు తమను కూడా లైంగికంగా వేధించాడని ఫిర్యాదు చేశారు. ఫోన్‌లో అసభ్యకర సందేశాలు పంపుతూ ఇబ్బందులకు గురిచేశాడని పేర్కొన్నారు.

Similar News

News January 19, 2026

122 అర్జీలు స్వీకరించిన జిల్లా ఎస్పీ

image

అనంతపురం జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన PGRS కార్యక్రమానికి 122 పిటిషన్లు వచ్చినట్లు జిల్లా SP జగదీశ్ తెలిపారు. ఎస్పీ స్వయంగా బాధితుల నుంచి అర్జీలను స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను త్వరితగతిన, చట్టపరిధిలో పరిష్కరించాలని సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. బాధితులకు న్యాయం చేయడమే తమ ప్రథమ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు.

News January 19, 2026

అనంతపురం: 54 మంది జడ్పీ ఉద్యోగులకు పదోన్నతులు

image

అనంతపురం జిల్లా పరిషత్ పరిధిలోని 54 మంది ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తూ జడ్పీ ఛైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆమె మాట్లాడుతూ.. పదోన్నతి పొందిన వారు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించి, వ్యవస్థకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ముందుండాలని దిశానిర్దేశం చేశారు. జడ్పీ సీఈఓ శివ శంకర్, డిప్యూటీ సీఈఓ వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.

News January 19, 2026

మహిళల భద్రతకు అగ్రపీఠం: జిల్లా ఎస్పీ

image

అనంతపురం జిల్లాలో మహిళలు, చిన్నారుల భద్రతను పటిష్టం చేయాలని ఎస్పీ పి.జగదీష్ గ్రామ, వార్డు మహిళా పోలీసులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన జూమ్ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. మహిళా పోలీసులు నిత్యం ప్రజల మధ్య ఉంటూ భరోసా కల్పించాలని సూచించారు. వేధింపులు జరిగే ప్రాంతాలను గుర్తించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. బాధితులకు అండగా నిలిచి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పేర్కొన్నారు.