News June 29, 2024

BSNLకు మారుతున్నారా?

image

దేశంలోని ప్రముఖ టెలికం కంపెనీలన్నీ రీఛార్జ్ రేట్లను పెంచేశాయి. అత్యధికంగా జియో 27% టారిఫ్స్ పెంచింది. AirTel, వొడాఫోన్ ఐడియా సైతం కస్టమర్లకు షాక్ ఇచ్చాయి. దీంతో చాలా మంది ప్రభుత్వరంగ సంస్థ అయిన BSNLకు షిఫ్ట్ అవుతున్నట్లు పోస్టులు చేస్తున్నారు. మిగతా కంపెనీలతో పోలిస్తే BSNLలో రీఛార్జ్ ధరలు తక్కువ. అయితే BSNL 4G సేవలు ఆగస్టు నుంచి అందుబాటులోకి వస్తున్నాయి. మరి మీది ఏ నెట్‌వర్కో కామెంట్ చేయండి.

Similar News

News September 21, 2024

యువీ ఆ రోజు ఏడు సిక్సులు కొట్టి ఉండేవారు: బ్రాడ్

image

2007 టీ20 వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్‌ ఓవర్లో యువరాజ్ సింగ్ 6 సిక్సులు కొట్టిన సంగతి తెలిసిందే. ఆ రోజు అంపైర్ కారణంగా యువీ ఏడో సిక్స్ మిస్ అయిందని బ్రాడ్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘ఆ ఓవర్ రీప్లే నేను మళ్లీ ఎప్పుడూ చూడలేదు. కానీ ఒక్క విషయం ఒప్పుకోవాలి. అంపైర్ చూడకపోవడం వల్ల ఆ ఓవర్లో ఓ నోబాల్ వేసినా తప్పించుకున్నాను. లేదంటే యూవీ 7 సిక్సులు కొట్టేసి ఉండేవారు’ అని వ్యాఖ్యానించారు.

News September 21, 2024

ఏచూరి స్ఫూర్తితో జమిలి ఎన్నికలపై పోరాడాలి: సీఎం రేవంత్

image

TG: సీతారాం ఏచూరిని కోల్పోవడం సమాజానికి తీరని నష్టం అని సీఎం రేవంత్ అన్నారు. HYDలో జరిగిన ఏచూరి సంస్మరణ సభలో మాట్లాడుతూ ‘జమిలి ఎన్నికల ముసుగులో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కుట్ర చేస్తోంది. దేశాన్ని కబళించాలని చూస్తోంది. సీతారాం ఏచూరి స్ఫూర్తితో జమిలి ఎన్నికల అంశంపై పోరాడాలి. ఈ సమయంలో ఆయన లేకపోవడం దేశానికి నష్టం’ అని వ్యాఖ్యానించారు.

News September 21, 2024

జగన్ పాలనలో అనేక దుస్సాహసాలు జరిగాయి: CM చంద్రబాబు

image

AP: గత ప్రభుత్వం వల్ల తిరుమల శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని CM చంద్రబాబు అన్నారు. ‘లడ్డూ అపవిత్రం కావడంపై లోతుగా విచారణ జరగాలి. రూ.320కే కిలో నెయ్యి ఎలా దొరుకుతుంది? జగన్ పాలనలో అనేక దుస్సాహసాలు జరిగాయి. రివర్స్ టెండరింగ్ పేరుతో సర్వనాశనం చేశారు. అన్ని దేవాలయాల్లో తనిఖీలు చేస్తున్నాం. తిరుమల పవిత్రతను కాపాడే అంశంపై పండితులతో చర్చిస్తున్నాం’ అని మీడియాతో చిట్ చాట్‌లో వ్యాఖ్యానించారు.