News June 29, 2024
జియో, ఎయిర్టెల్ యూజర్లపై ₹47వేలకోట్ల భారం!

టారిఫ్ పెంపుతో జియో, ఎయిర్టెల్ యూజర్లపై ఏటా ₹47,500కోట్ల భారం పడనుందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా 5జీ సేవలు కావాలనుకునే వారిపై ఈ భారం మరింత ఎక్కువ ఉండనుందని తెలిపారు. జియోలో ₹239 (1.5GB/డే)గా ఉన్న 5జీ మినిమమ్ రీఛార్జ్ అమౌంట్ను 46% పెంచి ₹349 (2GB/డే)కు చేర్చింది. ఎయిర్టెల్ ఏకంగా 71% పెంచింది. ₹239 (1.5GB/డే) ప్యాక్ను ₹409 (2.5GB/డే)కు పెంచింది.
Similar News
News January 3, 2026
14,582పోస్టులు.. టైర్- 2 ఎగ్జామ్స్ తేదీల ప్రకటన

కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్(CGL)-2025 టైర్ 2 పరీక్ష తేదీలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్(<
News January 3, 2026
BJPని చూసి RSSను అర్థం చేసుకోవద్దు: మోహన్ భాగవత్

‘‘RSS యూనిఫాం, వ్యాయామాలను చూసి పారా మిలిటరీ అనుకోవద్దు. అలాగే BJPని చూసి సంఘ్ను అర్థం చేసుకోవడం పెద్ద పొరపాటు’’ అని సంస్థ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. సమాజాన్ని ఏకం చేసి, విదేశీ శక్తుల చేతుల్లో భారత్ మళ్లీ చిక్కకుండా చూడటమే సంఘ్ లక్ష్యమని భోపాల్ (MP)లో మాట్లాడుతూ చెప్పారు. వికీపీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలు నమ్మకుండా, అసలు విషయం తెలుసుకోవడానికి నేరుగా ‘శాఖ’కు వచ్చి చూడాలని ఆయన పిలుపునిచ్చారు.
News January 3, 2026
శరీరంలో ఒత్తిడి ఎక్కువైతే కనిపించే లక్షణాలివే..

శరీరంలో ఒత్తిడి పెరిగినపుడు కార్టిసాల్ హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది. దీంతో బీపీ, షుగర్, జీవక్రియలు అస్తవ్యస్తమవుతాయి. ఇలా కాకుండా ఉండాలంటే మన శరీరం తెలిపే లక్షణాలను గమనించాలంటున్నారు నిపుణులు. కార్టిసాల్ ఎక్కువైతే నడుము చుట్టూ కొవ్వు పెరిగిపోతుంది. ఎప్పుడూ నీరసం, అలసట, చిరాకు, ఆందోళన, డిప్రెషన్ లక్షణాలు ఉంటాయి. అలాగే ఆలోచనా శక్తితో పాటు మెదడు పనితీరు కూడా తగ్గుతుందంటున్నారు నిపుణులు.


