News June 29, 2024
మహిళతో లైంగిక సంబంధం పెట్టుకోవడం నేరమే!

మహిళల హక్కులు, వారి గౌరవాన్ని పరిరక్షించడానికి కొత్త క్రిమినల్ చట్టాలలో కఠినమైన నిబంధనలు చేర్చినట్లు PIB పేర్కొంది. ఇకపై తప్పుడు వాగ్దానాలతో మహిళను లోబరుచుకొని ఆమెతో లైంగిక సంబంధాలను పెట్టుకోవడం నేరం. దోషులకు కఠిన శిక్షలు తప్పవని వెల్లడించింది. జులై 1 నుంచే కొత్త చట్టాలు అమలులోకి రానున్నాయి. ఇకపై పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండా ఆన్‌లైన్‌లోనే ఫిర్యాదు చేయొచ్చు.
Similar News
News January 13, 2026
ఊటనేల దున్నినా, మట్టి పిసికినా, ఫలితం బురదే

ఊటనేల ఎప్పుడూ నీరు ఊరుతూ ఉండే, సహజంగానే చిత్తడిగా ఉండే భూమి. ఆ నేలలో ఎంత కష్టపడి నాగలితో దున్నినా లేదా చేతులతో మట్టిని పిసికి గట్టి పరచడానికి ప్రయత్నించినా దాని స్వభావం మారదు. చివరికి మిగిలేది గట్టిపడని, వ్యవసాయానికి పనికిరాని బురద మాత్రమే. కొన్నిసార్లు కొందరి మనుషుల స్వభావాన్ని ఎంత మార్చాలని ప్రయత్నించినా అవి మారవు. దాని వల్ల మన శ్రమే వృథా అవుతుందని ఈ సామెత చెబుతుంది.
News January 13, 2026
పిల్లలపై పోసిన భోగి పళ్లను తినవచ్చా?

భోగి పళ్లను దిష్టి తీయడానికి పోస్తారు కాబట్టి తినొద్దని కొందరు అనుకుంటారు. అయితే వీటిని తినొచ్చని పండితులు సూచిస్తున్నారు. బదరీ ఫలాలను సాక్షాత్తు నారాయణ స్వరూపంగా భావిస్తారు కాబట్టి తిన్నా ఏ దోషం ఉండదని అంటున్నారు. అయినప్పటికీ అనుమానం ఉన్నా, తినడానికి ఇష్టం లేకపోయినా కొన్ని పండ్లను విడిగా ముందే పక్కకు తీసి పెట్టుకోవాలి. రేగుపళ్లలో సి-విటమిన్ అధికంగా ఉండటం వల్ల ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
News January 13, 2026
ఇరాన్‌తో వ్యాపారం చేస్తే 25% టారిఫ్: ట్రంప్

ఇరాన్‌తో ఉద్రిక్తతల వేళ ఆ దేశాన్ని ఆర్థికంగా దెబ్బకొట్టేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొత్త పథకం రచించారు. ఇరాన్‌తో వ్యాపారం చేయకుండా కొత్త టారిఫ్స్ తీసుకొచ్చారు. ఏ దేశాలైతే ఇరాన్‌తో వ్యాపారం చేస్తాయో.. అవి USతో బిజినెస్ చేయాలంటే 25% టారిఫ్స్ చెల్లించాల్సి ఉంటుంది అని ప్రకటించారు. ఈ నిర్ణయం ఇప్పుడే అమలులోకి వస్తుందని చెప్పారు. ఇది ఫైనల్ అంటూ కుండ బద్దలు కొట్టేశారు.


