News June 29, 2024

అమరావతిలో ప్రభుత్వ భవనాల కోసం 1,575 ఎకరాలు

image

AP: రాజధాని అమరావతిలో ప్రభుత్వ భవనాల నిర్మాణం కోసం 1,575 ఎకరాలను నోటిఫై చేస్తూ సీఆర్డీఏ గెజిట్ జారీ చేసింది. రాయపూడి, నేలపాడు, లింగాయపాలెం, శాఖమూరు, కొండరాజుపాలెం గ్రామాల్లో భూములను గుర్తించింది. సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు, ప్రజాప్రతినిధులు, అధికారుల క్వార్టర్స్‌ను నిర్మించనుంది. ఇప్పటికే కొన్ని భవనాల నిర్మాణం మొదలవగా, మిగతా వాటిపై ప్రభుత్వం దృష్టిసారించనుంది.

Similar News

News November 6, 2025

జ్ఞానాన్ని ప్రసాదించే వ్యాస మంత్రం

image

వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తేః పౌత్ర మకల్మషం |
పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్‌ ||3||
వసిష్ఠుడికి మునిమనవడు, శక్తి మహామునికి మనుమడు, పరాశరుడికి పుత్రుడు, పరమ పవిత్రుడు, గొప్ప తపస్సు సంపద కలిగినవాడు, శుకమహర్షి తండ్రి అయిన ఆ వేదవ్యాస మహర్షికి మనం నమస్కరించాలి. ఆ వ్యాసుడి గొప్ప వంశాన్ని, పవిత్రతను స్మరించుకొని, పూజించడం వలన ఆయనలా జ్ఞానం లభిస్తుందని నమ్మకం. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>

News November 6, 2025

ఈనెల 27న సింగపూర్‌కు బెస్ట్ టీచర్లు: లోకేశ్

image

AP: 78మంది బెస్ట్ టీచర్ అవార్డు గ్రహీతలను ఈనెల 27న సింగపూర్ పంపే ఏర్పాట్లు చేయాలని మంత్రి లోకేశ్ అధికారులకు సూచించారు. ‘విద్యా విధానాలపై అధ్యయనానికి బెస్ట్ టీచర్లను సింగపూర్ పంపిస్తున్నాం. స్టూడెంట్ అసెంబ్లీకి ఏర్పాట్లు చేయాలి. డిసెంబర్ 5న మెగా పేరెంట్ టీచర్ మీట్‌కు పెట్టాలి. ఇందులో ప్రజా ప్రతినిధులను భాగం చేయాలి. రాష్ట్రంలో కడప మోడల్ స్మార్ట్ కిచెన్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలి’ అని ఆదేశించారు.

News November 6, 2025

నా పిల్లలు చనిపోవాలని వాళ్లు కోరుకుంటున్నారు: చిన్మయి

image

SMలో అబ్యూస్‌పై సింగర్ చిన్మయి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ ట్విట్టర్ స్పేస్‌లో మహిళలను కించపరుస్తూ బూతులు తిట్టడాన్ని ఆమె ఖండించారు. ‘రోజూ అవమానాలతో విసిగిపోయాం. TGలో మహిళలకు మరింత గౌరవం దక్కాలి. నా పిల్లలు చనిపోవాలని వీళ్లు కోరుకుంటున్నారు. 15 ఏళ్లైనా పర్వాలేదు నేను పోరాడతా. సజ్జనార్ సార్ సహాయం చేయండి’ అని ట్వీట్ చేశారు. ఈ వివాదం ఏంటో పరిశీలించాలని సజ్జనార్ సైబర్ క్రైమ్ పోలీసులకు సూచించారు.