News June 29, 2024
ఖమ్మం: బావిలో పడ్డ ట్రాక్టర్, దంపతులకు తీవ్రగాయాలు

నేలకొండపల్లి మండల పరిధిలోని భైరవునిపల్లి సమీపంలోని వ్యవసాయ బావిలో విద్యుత్ మోటర్‌ను ట్రాక్టర్‌తో కట్టి లాగుతుండగా ప్రమాదవశాత్తు బావిలో పడింది. ట్రాక్టర్‌తో పాటు భార్యభర్తలు మాధవి, బాబు ఒక్కసారిగా బావిలో పడ్డారు. భర్త బాబు కేకలు వేయడంతో చుట్టుపక్కల ఉన్న వారు అక్కడకు చేరుకొని వారిని బయటకు తీశారు. ఈ ఘటనలో భర్త క్షేమంగా బయటపడగా భార్య మాధవికి తీవ్రగాయాలయ్యాయి.
Similar News
News July 7, 2025
దరఖాస్తు సమర్పించిన రోజే.. సమస్య పరిష్కారం.!

ఖమ్మం ముస్తఫానగర్‌కు చెందిన తుపాకుల శైలజకు 2022లో YSR కాలనీలో డబల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు కాగా, అప్పుడు అనారోగ్య కారణాల వల్ల ఇల్లు తీసుకోలేదు. దీంతో సోమవారం శైలజ ఖమ్మం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ అనుదీప్‌కు దరఖాస్తు అందించింది. వెంటనే స్పందించిన జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించడంతో ఆమెకు డబుల్ బెడ్రూమ్ ఇల్లును కేటాయించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌కు శైలజ కృతజ్ఞతలు తెలిపింది.
News July 7, 2025
ప్రజావాణి దరఖాస్తులు సత్వరమే పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్.. అదనపు కలెక్టర్లతో కలిసి ప్రజల నుంచి ఆర్జీలను స్వీకరించారు. ప్రజావాణి కార్యక్రమంపై ప్రజలలో నమ్మకం కలిగించాలని చెప్పారు. జిల్లా అధికారులు ప్రతి వారం మండల అధికారులతో ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంపై సమీక్షించాలన్నారు.
News July 7, 2025
ఖమ్మం: ఇందిరమ్మ ఇళ్ల ఎఫెక్ట్.. పెరిగిన ధరలు

పేద, మధ్య తరగతి వర్గాల కలల ఇందిరమ్మ ఇళ్లపై ధరల భారం భారీగా పెరిగింది. ఇళ్ల నిర్మాణాలు ఇప్పుడిప్పుడే మొదలు పెడుతున్న తరుణంలో సామగ్రి రేట్లు అధికం కావడంతో భారంగా మారింది. వీటికి తోడు సిమెంట్, స్టీల్, ఇసుక ధరలతో పాటు, కూలీ రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. పెరిగిన ధరలను బట్టి ఒక్కో ఇంటిపై ప్రభుత్వం ఇచ్చే రూ.5 లక్షలతో పాటు, మరో రూ.3 నుంచి రూ.4 లక్షల వరకు అదనపు భారం పడుతుందని లబ్ధిదారులు వాపోతున్నారు.