News June 29, 2024
T-20 వరల్డ్ కప్ ఫైనల్స్.. రాజమండ్రిలో లైవ్ స్క్రీనింగ్

ఇండియా – సౌత్ ఆఫ్రికా ఆడుతున్న టీ-20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లైవ్ స్క్రీనింగ్ రాజమండ్రిలో ఏర్పాటు చేస్తున్నట్లు సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలియజేశారు. మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న సుబ్రహ్మణ్య మైదానంలో లైవ్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశామన్నారు. నగర ప్రజలు మైదానానికి తరలివచ్చి టీమ్ ఇండియాకి మద్దతు తెలపాలని కోరారు.
Similar News
News January 17, 2026
అందరినీ అలరించడం చిరంజీవికే సాధ్యం: వీవీ వినాయక్

ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ శుక్రవారం తన స్వగ్రామమైన చాగల్లులో పర్యటించారు. సంక్రాంతి సెలవుల్లో స్నేహితులతో కలిసి సొంత థియేటర్‌లో ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రాన్ని వీక్షించారు. అన్ని వర్గాలను ఆకట్టుకోవడమే మెగాస్టార్ ఆకాంక్ష అని ఆయన కొనియాడారు. చిరంజీవి ఫ్యామిలీ నుంచి మరిన్ని మంచి చిత్రాలు రావాలని ఆకాంక్షించారు. పండుగ పూట వినాయక్ రాకతో గ్రామంలో సందడి నెలకొంది.
News January 15, 2026
తూ.గో: యాంకర్ శ్యామల సంచలన వ్యాఖ్యలు

భక్తుడికి అన్యాయం జరుగుతుంటే దేవుడు చూస్తే ఉరుకోడని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్.శ్యామల పేర్కొన్నారు. ఫ్లెక్సీ ఘటనలో అరెస్టై, విడుదలైన వైసీపీ కార్యకర్తలను తూర్పు చోడవరంలో బుధవారం ఆమె పరామర్శించారు. వైసీపీ అధినేత జగన్‌ను ఉద్దేశించి భక్తులకు అన్యాయం జరిగిందంటే దేవుడు ఊరుకోడని, తప్పకుండా స్పందిస్తారని ఆమె వెల్లడించారు. కార్యకర్తలకు భరోసా ఇచ్చి ధైర్యం చెప్పారు.
News January 15, 2026
కొవ్వూరు: కోడిపందేల్లో గెలిస్తే మోటార్ సైకిళ్లు గిఫ్ట్

కొవ్వూరు మండలం ఐపంగిడిలో బుధవారం కోడిపందేల నిర్వాహకులు బంపర్ ఆఫర్లు ప్రకటించారు. పందేల్లో గెలిచిన పుంజుల యజమానులకు మోటార్ సైకిళ్లు బహుమతిగా ఇస్తామని ప్రకటించి, బరుల వద్ద వాటిని ప్రదర్శనకు ఉంచారు. ఒక శిబిరంలో ఆరు పుంజుల పోటీలో నెగ్గిన వారికి, మరోచోట ఇద్దరు విజేతలకు బైక్‌లు అందజేస్తామన్నారు. పందెం రాయుళ్లను ఆకర్షించేందుకు నిర్వాహకులు ఇలాంటి భారీ ఆఫర్లు ప్రకటించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.


