News June 29, 2024
అయోధ్య రోడ్లు జలమయం.. ఆరుగురు ఉద్యోగుల సస్పెండ్

యూపీలోని అయోధ్యలో కొత్తగా నిర్మించిన 14KM రోడ్డు ఇటీవల కురిసిన వర్షాలకు జలమయం అయ్యింది. ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు దిగింది. మురుగు కాలువల నిర్మాణంలో నిర్లక్ష్యం వహించిన ఆరుగురు అధికారులను సస్పెండ్ చేసింది. అహ్మదాబాద్‌కు చెందిన కాంట్రాక్టర్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
Similar News
News January 31, 2026
మేడారంలో మొబైల్ ఛార్జింగ్‌కు రూ.50!

మేడారం జాతర ‘కాదేదీ వ్యాపారానికి అనర్హం’ అన్నట్లుగా మారింది. మొక్కులు తీర్చుకోవడానికి వచ్చిన భక్తుల అవసరమే కొందరికి ఉపాధినిస్తోంది. అక్కడ ఏర్పాటు చేసిన ఛార్జింగ్ పాయింట్లలో ఒక్క మొబైల్ ఫుల్ ఛార్జ్ అయ్యేందుకు రూ.50 వసూలు చేస్తున్నారు. అలాగే వేడి నీళ్లంటూ కొందరు, స్నానాలు చేసే సమయంలో బ్యాగులకు కాపలా ఉంటూ మరికొందరు కూడా జాతరలో ఉపాధి పొందుతున్నారు.
News January 30, 2026
కాలుష్యాన్ని నివారించలేం.. నియంత్రించాలి: పవన్

AP: కాలుష్యం మన జీవితంలో అంతర్భాగమైందని DyCM పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కొంతమేర పొల్యూషన్‌ను భరించకతప్పని పరిస్థితి ఏర్పడిందన్నారు. పూర్తిస్థాయిలో నివారించలేకున్నా నియంత్రించే ప్రయత్నం చేయాలని సూచించారు. పారిశ్రామికవాడల్లో ప్రత్యేక శ్రద్ధపెట్టాలని చెప్పారు. విశాఖ పరిధిలోని పరిశ్రమల యాజమాన్యాలతో ఆయన భేటీ అయ్యారు. పరిశ్రమలు 33% గ్రీన్ బెల్ట్ రూల్ పాటించాలని స్పష్టంచేశారు.
News January 30, 2026
సల్మాన్-ఐశ్వర్యా రాయ్ లవ్ స్టోరీపై నిర్మాత ఇంట్రెస్టింగ్ కామెంట్స్

సల్మాన్ ఖాన్, ఐశ్వర్యా రాయ్ ఓల్డ్ రిలేషన్‌షిప్‌పై నిర్మాత శైలేంద్ర సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వారిద్దరిదీ ‘రోమియో-జూలియట్’ తరహాలో ఎమోషనల్, ‘వయలెంట్ లవ్ స్టోరీ’ అని పేర్కొన్నారు. ఐశ్వర్య గౌరవప్రదమైన, తెలివైన వ్యక్తి అని, సల్మాన్ చాలా ప్యాషనేట్ అని తెలిపారు. సల్మాన్ కంటే ముందు ఆమెకు మోడల్ రాజీవ్ మూల్‌చందనీతో మాత్రమే రిలేషన్ ఉండేదని.. ఇండస్ట్రీలో మరెవరితోనూ లేదని చెప్పారు.


