News June 29, 2024
అధైర్యపడవద్దు.. అండగా ఉంటాం: కడప ఎంపీ

‘అధైర్యపడవద్దు, అందరికీ అండగా ఉంటాం’ అని కడప ఎంపీ అవినాశ్ రెడ్డి అన్నారు. శనివారం వేములలోని మండలంలోని కార్యకర్తలు, నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తొందర్లోనే మళ్లీ అధికారంలోకి వస్తామని, ఈ ఐదేళ్లు ఐదు రోజుల్లా గడిచిపోతాయని ఆయన వారికి ధైర్యం చెప్పారు. ప్రజా తీర్పును మనం గౌరవించాలని ఆయన కోరారు. అలాగే మండలంలోని పలు సమస్యలపై వారితో మాట్లాడారు.
Similar News
News January 16, 2026
కమలాపురం: ప్రత్యక్ష రాజకీయాల్లోకి మాజీ ఎమ్మెల్యే

కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి తిరిగి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారనే చర్చ జరుగుతోంది. కమలాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పనిచేసిన వీర శివారెడ్డికి ప్రజల్లో ప్రత్యేకమైన గుర్తింపు, అనుచరవర్గం ఉంది. ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజానాయకుడిగా గుర్తింపు పొందిన ఆయన కొంతకాలంగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.
News January 16, 2026
ప్రొద్దుటూరులో అవినీతిపై చర్యలు ఏవీ..?

ప్రొద్దుటూరు ప్రభుత్వ శాఖల్లోని అవినీతిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. మున్సిపాలిటీ పెట్రోల్ బంకులో రూ.కోట్లల్లో స్కాం జరిగినట్లు ఆడిట్ గుర్తించినా రికవరీ లేదు. అగస్త్యేశ్వరాలయంలో బంగారు, వెండి, నగదు ఇంటి దొంగలు కొట్టేసినా చర్యలులేవు. పేజ్-3లో కాంట్రాక్టర్లు బిల్లులు తీసుకుని ఇళ్ల నిర్మాణాలు చేయకపోయినా చర్యలు లేవు. హౌస్ బిల్డింగ్ సొసైటీలో అక్రమాలపై MLA ఫిర్యాదు చేసినా రికవరీ లేదు.
News January 15, 2026
కడప బస్టాండ్‌లో తప్పిన ప్రమాదం

కడపలో ఓ వ్యక్తి చేసిన తప్పిదంతో ప్రజలు హడలిపోయారు. పులివెందుల బస్సుకు తాళం అలాగే వదిలేసి డ్రైవర్ వెళ్లిపోయాడు. ఈక్రమంలో ఓ యువకుడు బస్సు స్టార్ట్ చేశాడు. అప్పటికే అందులో ఉన్న ప్రయాణికులు అతడి తీరు చూసి భయంతో కేకలు వేశారు. ఆర్టీసీ సిబ్బంది, పోలీసులు వచ్చి యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ యువకుడి మతిస్థిమితం సరిగా లేదని సమాచారం. పొరపాటున అతను డ్రైవ్ చేసి ఉంటే ప్రమాదం జరిగి ఉండేది.


