News June 29, 2024

ఈ మూవీ స్టోరీని ఎవరూ ఊహించలేకపోయారు: కమల్ హాసన్

image

‘భారతీయుడు-2’ సినిమా స్టోరీ ఇదేనంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని హీరో కమల్ హాసన్ అన్నారు. ఇలాంటివి ఆసక్తికరంగా ఉన్నా ఈ సినిమా కథను ఎవరూ ఊహించలేకపోయారని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ మూవీకి కొనసాగింపుగా తెరకెక్కే ‘భారతీయుడు-3’లో సేనాపతికి తండ్రి పాత్ర కూడా ఉంటుందని వెల్లడించారు. కాగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘భారతీయుడు-2’ జులై 12న థియేటర్లలో విడుదల కానుంది.

Similar News

News September 21, 2024

INDvBAN: వరుణుడి పలకరింపు

image

భారత్, బంగ్లాదేశ్ మధ్య తొలి టెస్ట్ జరుగుతున్న చిదంబరం స్టేడియంలో రాత్రి, తెల్లవారుజామున వర్షం కురిసింది. దీంతో మైదానంపై కవర్స్ కప్పారు. ప్రస్తుతం వర్షం లేకపోవడంతో కవర్స్‌ను తొలగించారు. ఆటగాళ్లు గ్రౌండ్‌లో ప్రాక్టీస్ చేస్తూ కనిపించారు. అటు ఇప్పటికే 321 రన్స్ ఆధిక్యంలో ఉన్న భారత భారీ స్కోర్ చేస్తే ఈరోజు మ్యాచ్‌ను గెలిచే ఛాన్స్ ఉంది.

News September 21, 2024

నటి జెత్వానీ కేసు.. నేడు విజయవాడకు విద్యాసాగర్ తరలింపు

image

AP: ముంబై నటి జెత్వానీని వేధించిన కేసులో అరెస్టయిన కుక్కల విద్యాసాగర్‌ను పోలీసులు నేడు విజయవాడ కోర్టులో హాజరుపరచనున్నారు. నిన్న డెహ్రాడూన్‌లో అతడిని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు, ముందుగా అక్కడి కోర్టులో హాజరుపరిచారు. ట్రాన్సిట్ వారెంట్‌పై ఇవాళ విజయవాడకు తీసుకురానున్నారు.

News September 21, 2024

డిగ్రీ కోర్సులను మార్చుకోవాలనుకుంటున్నారా?

image

TG: డిగ్రీ కోర్సులను మార్చుకునేందుకు విద్యాశాఖ అధికారులు అవకాశం కల్పించారు. దోస్త్ కౌన్సెలింగ్‌లో భాగంగా రాష్ట్రంలో ఇప్పటికే డిగ్రీ సీట్లు భర్తీ చేశారు. ఈనెల 21 నుంచి 23 వరకు విద్యార్థులు వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకుంటే 24న కొత్త కోర్సుల కేటాయింపు జాబితాను ప్రకటించనున్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.