News June 29, 2024
ఇంటింటికి వెళ్లి పెన్షన్ ఇవ్వనున్న సీఎం చంద్రబాబు!

AP: సీఎం చంద్రబాబు స్వయంగా తాడేపల్లి మండలం పెనుమాకలో ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. దేశ చరిత్రలో ఓ సీఎం ఇలా చేయడం ఇదే తొలిసారి. ఇప్పటికే అధికారులు ఆ గ్రామంలో పెన్షన్ లబ్ధిదారుల జాబితాను రూపొందించారు. జులై 1నుంచి రాష్ట్రంలో పెన్షన్లు పంపిణీ చేయాలని CBN ఆదేశించిన సంగతి తెలిసిందే. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఈ పంపిణీ చేసేలా సర్దుబాటు చేయాలన్నారు.
Similar News
News December 31, 2025
110 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ (<
News December 31, 2025
భోగాపురంలో జనవరి 4న తొలి ఫ్లైట్ ల్యాండింగ్

AP: విజయనగరం జిల్లా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో జనవరి 4న తొలి టెస్టింగ్ ఫ్లైట్ ల్యాండ్ కానుందని నిర్మాణ సంస్థ GMR ప్రకటించింది. ఢిల్లీ నుంచి కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీ కలిశెట్టి విమానంలో రానున్నారు. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రన్‌వే, ఏటీసీ, టెర్మినల్ భవనాలు తుది దశలో ఉన్నాయి. 2026 మే నుంచి ఈ విమానాశ్రయం అధికారికంగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
News December 31, 2025
మందుబాబులకు ఫ్రీ రైడ్.. ఈ నంబర్‌కు కాల్ చేయండి

TG: న్యూఇయర్ వేళ మందు బాబుల కోసం తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫాం వర్కర్స్ యూనియన్(టీజీపీడబ్ల్యూయూ) ఉచిత రైడ్ సేవలు ఇవ్వనున్నట్లు తెలిపింది. మద్యం తాగి వాహనం నడపలేని స్థితిలో ఉన్నవారికి ఈ సర్వీస్ అందిస్తామని తెలిపింది. HYD, సైబరాబాద్, రాచకొండ పరిధిలో ఇవాళ రాత్రి 11 గంటల నుంచి జనవరి 1 అర్ధరాత్రి ఒంటిగంట వరకు సేవలు ఉంటాయని పేర్కొంది. 8977009804 నంబర్‌కు కాల్ చేసి ఈ సర్వీసులు పొందవచ్చని వెల్లడించింది.


