News June 29, 2024
ప.గో. కలెక్టర్‌ను కలిసిన SP

పశ్చిమగోదావరి జిల్లా నూతన కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన నాగరాణిని ఎస్పీ అజిత వేజెండ్ల శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌కు పూలకుండీ అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లాలోని లాండ్ ఆర్డర్‌పై వివరించారు.
Similar News
News February 4, 2026
ప.గో: SMలో పరిచయమైన బాలికలపై అత్యాచారయత్నం

సోషల్ మీడియా పరిచయంతో ఇద్దరు బాలికలపై అఘాయిత్యానికి పాల్పడిన ఘటనపై మొగల్తూరు పోలీసులు మంగళవారం రెండు పోక్సో కేసులు నమోదు చేశారు. SI నాగలక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం.. యలమంచిలి(M)కి చెందిన బాలికలను పీఎం లంకకు చెందిన తిరుమాని దుర్గా ప్రసాద్, రాజేంద్రలు మొగల్తూరులోని ఓ లాడ్జ్‌కు పిలిచి, అత్యాచారయత్నం చేశారు. బాధితుల తల్లుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
News February 4, 2026
అత్తిలి: వివాహితతో అసభ్య ప్రవర్తన.. చివరికి..!

ప.గో జిల్లా అత్తిలి మండలం ఈడూరులో ఓ వివాహితపై అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిపై కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బింకం చిన్న పండు అనే వ్యక్తి మూడేళ్లుగా వివాహితను ఫోన్‌లో వేధిస్తున్నాడు. గత నెల 22న ఆమె ఇంట్లోకి ప్రవేశించి అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె భర్త రావడంతో నిందితుడు పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు అత్తిలి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
News February 4, 2026
తణుకు: పోలీసులపై ఏసీబీ విచారణ?

తణుకు పట్టణ పోలీస్ స్టేషన్ రైటర్ సుబ్బారావు రూ. 25 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు చిక్కిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో అధికారుల పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రైటర్ వెనుక ఉన్న సూత్రధారులపై ఏసీబీ ఆరా తీస్తోంది. ఇప్పటికే CI పాత్రపై కూడా దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీబీ DSP కృష్ణారావు వెల్లడించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.


