News June 29, 2024

న్యాయవ్యవస్థ నిష్పక్షపాతంగా ఉండాలి: మమత

image

సామాన్యులను రక్షించడం న్యాయవ్యవస్థ ప్రథమ బాధ్యతని, అదెప్పుడూ నిష్పక్షపాతంగా ఉండాలని బెంగాల్ CM మమతా బెనర్జీ అన్నారు. కోల్‌కతాలో నేషనల్ జుడీషియల్ అకాడమీ సదస్సులో CJI జస్టిస్ చంద్రచూడ్‌తో కలిసి ఆమె పాల్గొన్నారు. ‘కోర్టు.. గుడి, చర్చి, మసీదు, గురుద్వార లాంటిది. న్యాయవ్యవస్థను మెరుగుపరచడానికి మేం రూ.1,000 కోట్లు ఖర్చు పెట్టాం. 88 ఫాస్ట్ ట్రాక్, 99 మానవ హక్కుల కోర్టులు ఏర్పాటుచేశాం’ అని ఆమె తెలిపారు.

Similar News

News September 20, 2024

దిగ్గజాల సరసన యశస్వీ జైస్వాల్

image

భారత క్రికెటర్ యశస్వీ జైస్వాల్ చరిత్ర సృష్టించారు. తొలి 10 టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన నాలుగో బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పారు. బంగ్లాతో జరుగుతున్న తొలి టెస్టులో ఆయన ఈ ఫీట్ సాధించారు. ఈ 10 టెస్టుల్లో 1,094 పరుగులు చేసిన జైస్వాల్ మార్క్ టేలర్(1,088)ను అధిగమించారు. ఈ జాబితాలో బ్రాడ్‌మన్(1,446) అగ్ర స్థానంలో ఉండగా, తర్వాతి స్థానాల్లో ఎవర్టన్ వీక్స్(1,125), జార్జ్ హెడ్లీ(1,102) కొనసాగుతున్నారు.

News September 20, 2024

కల్తీ నెయ్యి ఘటన.. దేవాదాయశాఖ అప్రమత్తం

image

AP: తిరుమలలో కల్తీ నెయ్యి ఘటనతో ఏపీ దేవాదాయ శాఖ అప్రమత్తమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో వినియోగించే ఆవు నెయ్యి నాణ్యత వివరాలను సేకరిస్తోంది. ప్రముఖ దేవాలయాల్లో ఆవు నెయ్యి కొనుగోళ్లపై ఆరా తీస్తోంది. దీనిపై త్వరలోనే విధివిధానాలను ఖరారు చేసే యోచనలో దేవదాయశాఖ ఉన్నట్లు తెలుస్తోంది.

News September 20, 2024

తిరుమల లడ్డూ వివాదంపై రాహుల్ గాంధీ రియాక్షన్

image

AP: తిరుమల లడ్డూ వివాదంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ప్రసాదం నాణ్యతపై వస్తున్న విమర్శలు కలకలం రేపుతున్నాయని అన్నారు. ‘ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందికి ‘బాలాజీ’ ఆరాధ్య దేవుడు. ఈ ఆరోపణలు ప్రతి ఒక్క భక్తుడిని బాధిస్తున్నాయి. ఈ అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరముంది. మన దేశంలోని మతపరమైన ప్రదేశాల పవిత్రతను అధికారులు కాపాడాలి’ అని Xలో ట్వీట్ చేశారు.