News June 29, 2024
యధావిధిగా ప్రజావాణి కార్యక్రమం: జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి

వచ్చే సోమవారం నుంచి నల్గొండ జిల్లా స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని యథావిధిగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సోమవారం నల్గొండ జిల్లా కేంద్రానికి వచ్చి ఫిర్యాదులు సమర్పించాలనుకొనే ఫిర్యాదు దారులు సంబంధిత మండలాలలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలోనే ఫిర్యాదులు సమర్పించాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.
Similar News
News January 12, 2026
NLG: ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల దందా.. విద్యాశాఖ మౌనమెందుకు?

కార్పొరేట్ పాఠశాలలు పబ్లిసిటీ పేరుతో తల్లిదండ్రుల జేబులకు చిల్లు పెడుతున్నాయి. నల్గొండ, మిర్యాలగూడ, హాలియా, దేవరకొండ సహా పలు కేంద్రాల్లో విద్యార్థుల నుంచి ప్రోగ్రాంల పేరుతో అడ్డగోలుగా వసూళ్లు చేస్తున్నారని ఆరోపణలొస్తున్నాయి. కేవలం వండర్ లా విహారయాత్ర పేరుతో ఒక్కో విద్యార్థి నుంచి రూ. 2500 వరకు గుంజుతున్నట్లు సమాచారం. ఇలాంటి వసూళ్లపై అధికారులు చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
News January 12, 2026
NLG: రైతు వేదిక.. నిర్వహణ లేక..

జిల్లాలో నిర్మించిన రైతు వేదికల నిర్వహణ భారంగా మారింది. జిల్లాలోని 140 వేదికలకు గాను ఇప్పటివరకు సుమారు రూ.3 కోట్ల వరకు ప్రభుత్వం నుంచి నిధులు రావాల్సి ఉందని ఏఈవోలు తెలిపారు. దీంతో కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ వేదికలు నిరుపయోగంగా మారాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ నిధులు రాకపోవడంతో వేదికల నిర్వహణ విషయంలో వ్యవసాయ శాఖ అధికారులు ఇబ్బందులు పడుతున్నారు.
News January 12, 2026
రాష్ట్ర అండర్ 19 కబడ్డీ జట్టు కెప్టెన్‌గా నల్గొండ వాసి

నల్గొండ జిల్లా అనుముల గ్రామానికి చెందిన టి. కార్తీక్ జాతీయ స్థాయి అండర్-19 తెలంగాణ కబడ్డీ జట్టు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. వరంగల్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ చాటడంతో ఈ అవకాశం దక్కింది. ఈ నెల 12 నుంచి 16 వరకు హరియాణాలో జరిగే జాతీయ కబడ్డీ పోటీల్లో కార్తీక్ తెలంగాణ జట్టును నడిపించనున్నాడు. ఈ సందర్భంగా జిల్లా క్రీడాకారులు, గ్రామస్థులు కార్తీక్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.


