News June 29, 2024
ప్రధాని మోదీతో సిద్ద రామయ్య భేటీ

రాబోయే బడ్జెట్‌లో కేటాయింపుల విషయంలో కర్ణాటకపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రధాని మోదీని సీఎం సిద్ద రామయ్య కోరారు. ఢిల్లీలో PMతో నిర్మాణాత్మక చర్చలు జరిగాయని కర్ణాటక సీఎంవో ట్వీట్ చేసింది. బెంగళూరుకు పెట్టుబడులు వచ్చే విషయంలో చొరవ చూపాలని విజ్ఞప్తి చేసినట్లు పేర్కొంది. కర్ణాటక అభివృద్ధి, పురోగతికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించినట్లు తెలిపింది. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం DK శివకుమార్ పాల్గొన్నారు.
Similar News
News November 18, 2025
పెదాలు పగులుతున్నాయా?

శీతాకాలంలో పెదాలు తరచూ పొడిబారి పగిలిపోతుంటాయి. ఇలా కాకుండా ఉండాలంటే వెన్న, నిమ్మరసం, దోస, టమాటా గుజ్జు పూయాలి. లిప్‌బామ్ రాయడం మర్చిపోకూడదు. రాత్రి పడుకునే ముందు నేతితో పెదాలను మర్దనా చేయడం వల్ల కూడా పెదాలు మృదువుగా ఉంటాయి. డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవాలి. నాణ్యమైన ఉత్పత్తులనే వాడాలి. అలాగే మంచి పోషకాహారం, తగినంత నిద్ర మిగతా శరీర భాగాల్లాగే పెదాలకూ అవసరం. కాబట్టి జీవనశైలి బావుండేలా చూసుకోవాలి.
News November 18, 2025
కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో ఉద్యోగాలు

కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ 27 కాంట్రాక్ట్ ఆపరేటర్ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 21వరకు అప్లై చేసుకోవచ్చు. ఏడో తరగతి ఉత్తీర్ణతతో పాటు హెవీ వెహికల్ లైసెన్స్, ఉద్యోగ అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. ప్రాక్టికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.200, SC,STలకు ఫీజు లేదు.