News June 30, 2024

2న చిత్తూరులో కందిపప్పు కౌంటర్ ప్రారంభం

image

చిత్తూరు రైతు బజారులో నాణ్యమైన కందిపప్పు కేజీ రూ.165కే విక్రయించే కౌంటర్ జులై 2న ఏర్పాటు చేస్తున్నట్లు జేసీ శ్రీనివాసులు వెల్లడించారు. ఈ మేరకు ధరల నియంత్రణ కమిటీతో చర్చించారు. పెనుమూరు, కార్వేటినగరం, జీడీ నెల్లూరు, నగరి మండలాల్లో ప్రత్యేక మొబైల్ వాహనాల ద్వారా తక్కువ ధరకు టమాటా విక్రయించడానికి చర్యలు చేపడతామన్నారు. కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి శంకర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Similar News

News September 20, 2024

బంగారుపాళ్యం నుంచే దండయాత్రగా మారింది: లోకేశ్

image

కుప్పం నుంచి చేపట్టిన తన యువగళం యాత్ర బంగారుపాళ్యం నుంచి దండయాత్రగా మారిందని మంత్రి నారా లోకేశ్ అన్నారు. ‘యువగళాన్ని అడ్డుకునేందుకు ఆనాటి ప్రభుత్వం జీవో తెచ్చి అడ్డంకులు సృష్టించింది. అయినా భయపడలేదు. నాపై 23 కేసులు నమోదు చేశారు. పాదయాత్రలో నా దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు సూపర్-6 పథకాలు ఉపయోగపడతాయి. సీఎం చంద్రబాబుతో చర్చించి వాటిని అమలు చేస్తా’ అని లోకేశ్ చెప్పారు.

News September 20, 2024

మొగిలి ఘాట్‌లో మరో ప్రమాదం

image

బంగారుపాళ్యం మండలం మొగిలి ఘాట్‌లో మరో ప్రమాదం జరిగింది. ఇటీవల ఇక్కడ ఘోర ప్రమాదం జరగడంతో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేశారు. వీటిపై అవగాహన లేని ఓ టెంపో ట్రావెలర్ వేగంగా వచ్చి ఇక్కడ అదుపుతప్పింది. రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆరుగురికి గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. వారిని బంగారుపాళ్యం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

News September 20, 2024

ప్రభుత్వ ఉద్యోగులకు హెల్మెట్ తప్పనిసరి: చిత్తూరు కలెక్టర్

image

చిత్తూరు జిల్లాలో బైక్‌లు వాడే అన్ని శాఖల ప్రభుత్వ ఉద్యోగులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు గురువారం ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. తొలుత ప్రభుత్వ ఉద్యోగులు బాధ్యతగా హెల్మెట్లను వినియోగించడం ద్వారా ప్రజల్లో మరింత చైతన్యం తీసుకొచ్చేందుకు అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు.