News June 30, 2024

టీమ్ ఇండియాకు రాష్ట్రపతి అభినందనలు

image

టీమ్ ఇండియాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందనలు తెలిపారు. క్లిష్ట పరిస్థితుల్లో జట్టు అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిందని కొనియాడారు. ఇది అసాధారణ విజయమని.. జట్టుని చూసి దేశం గర్విస్తోందని అన్నారు. ఇటు కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ సైతం రోహిత్ సేనకు అభినందనలు తెలిపారు. ఈ విజయం రోహిత్ నాయకత్వానికి నిదర్శమని వ్యాఖ్యానించారు.

Similar News

News September 21, 2024

BJP స్టిక్కర్ అన్ని నేరాల నుంచి రక్షిస్తుంది: కాంగ్రెస్ ధ్వ‌జం

image

గురుగ్రామ్‌లో రాంగ్ రూట్‌లో వెళ్తున్న ఓ కారు వ్య‌క్తి మృతికి కార‌ణ‌మ‌వ్వ‌డంపై BJPని కాంగ్రెస్ టార్గెట్ చేసింది. ఈ ఘ‌ట‌న‌లో బైక‌ర్ మృతికి కార‌ణ‌మైన కారు డ్రైవ‌ర్‌కు ఒక్క రోజులోనే బెయిల్ మంజూరైంది. అత‌ని కారుపై BJP స్టిక్క‌ర్ ఉండ‌డమే దీనికి కారణమనే విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. దీంతో బీజేపీ స్టిక‌ర్ అన్ని నేరాల నుంచి ర‌క్షిస్తుందంటూ కాంగ్రెస్ విమర్శించింది. ఇది బీజేపీ జంగిల్ రూల్ అంటూ మండిప‌డింది.

News September 21, 2024

సచివాలయ ఉద్యోగుల బదిలీలపై కీలక ఆదేశాలు

image

AP: సచివాలయ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 22తో బదిలీల ప్రక్రియ గడువు ముగియనుంది. అయితే ఈ నెల 20 నుంచి 26 వరకు ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమాన్ని సర్కార్ చేపడుతోంది. సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వెళ్లి 100 రోజుల ప్రభుత్వ పాలనను ప్రజలకు వివరించే కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. దీంతో ఉద్యోగులను వారి స్థానాల నుంచి రిలీవ్ చేయొద్దని కలెక్టర్లను GOVT ఆదేశించింది.

News September 21, 2024

మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాశ్ మృతి

image

AP: మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాశ్ (72) మరణించారు. అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. రేపు విజయవాడలోని మొగల్రాజపురంలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. 1983లో టీడీపీ తరఫున విజయవాడ తూర్పు నుంచి జయప్రకాశ్ ఎమ్మెల్యేగా గెలిచారు. మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌కు అత్యంత సన్నిహితులు. రాష్ట్ర విభజన సమయంలో సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ముందుండి నడిపించారు.