News June 30, 2024
జూన్ 30: చరిత్రలో ఈరోజు

1928: నటుడు జె.వి. సోమయాజులు జననం
1948: నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ జననం
1982: హీరో అల్లరి నరేష్ జననం
1969: శ్రీలంక క్రికెటర్ సనత్ జయసూర్య జననం
1917: భారత జాతీయ నాయకుడు దాదాభాయి నౌరోజీ మరణం
1984: ప్రముఖ తెలుగు కవి రాయప్రోలు సుబ్బారావు మరణం
1988: హాస్యనటుడు సుత్తి వీరభద్ర రావు మరణం
ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం.
Similar News
News October 21, 2025
తిరుమలలో కొనసాగుతున్న రద్దీ

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు భక్తులు క్యూలైన్‌లో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. అటు నిన్న 72,026 మంది స్వామి వారిని దర్శించుకున్నట్లు చెప్పారు. 23,304 మంది తలనీలాలు సమర్పించారన్నారు. హుండీ కానుకల ద్వారా రూ.3.86 కోట్ల ఆదాయం వచ్చిందని వెల్లడించారు.
News October 21, 2025
సమాజాన్ని మేలుకొల్పే చిత్రాలకు చిరునామా ఆయన

సామాజిక అంశాలనే కథాంశంగా సంచలన సినిమాలు తీసిన దర్శకుడిగా టి.కృష్ణ పేరొందారు. విజయశాంతిని స్టార్‌ను చేసిన ‘ప్రతిఘటన’ చిత్రానికి ఆయనే డైరెక్టర్. నేటి భారతం, వందేమాతరం, దేవాలయం, దేశంలో దొంగలు పడ్డారు, రేపటి పౌరులు, అర్ధరాత్రి స్వతంత్రం తదితర చిత్రాలకు దర్శకత్వం వహించారు. క్యాన్సర్ బారిన పడిన ఆయన 1987లో కన్నుమూశారు. హీరో గోపీచంద్ ఈయన కుమారుడే. ఇవాళ టి.కృష్ణ వర్ధంతి.
News October 21, 2025
సైబర్ క్రైమ్ గ్యాంగ్ లీడర్.. కేరాఫ్ చాయ్‌వాలా

బిహార్‌లో అభిషేక్ కుమార్ అనే చాయ్‌వాలా అంతర్రాష్ట్ర సైబర్ క్రైమ్ నెట్‌వర్క్ లీడర్‌గా తేలాడు. వివిధ రాష్ట్రాల్లో ఎన్నో సైబర్ నేరాలకు పాల్పడిన అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అభిషేక్ ఇంట్లో సోదాలు చేపట్టి రూ.1.05 కోట్ల నగదు, 344గ్రా. గోల్డ్, 1.75KGs సిల్వర్ సీజ్ చేశారు. 85 ATM కార్డులు, 75 బ్యాంక్ పాస్‌బుక్స్, 28 చెక్‌బుక్స్, ఆధార్ కార్డ్స్, ల్యాప్‌టాప్స్, ఫోన్స్, లగ్జరీ కారు స్వాధీనం చేసుకున్నారు.