News June 30, 2024
నేడు నిజామాబాద్‌కు సీఎం రేవంత్ రెడ్డి

మాజీ పీసీసీ అధ్యక్షుడు, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ అంత్యక్రియలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానున్నట్లు సీఎంఓ వర్గాలు తెలిపాయి. ధర్మపురి శ్రీనివాస్ అంతక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తున్న నేపథ్యంలో అంతక్రియలకు సీఎంతో పలువురు మంత్రులు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.
Similar News
News December 31, 2025
NZB: పెరిగిన డ్రంక్ & డ్రైవ్ కేసులు

జిల్లాలో మద్యం తాగి పట్టుబడిన కేసులు అధికంగా నమోదయ్యాయి. గతేడాది 8,410 డ్రంకెన్ డ్రైవ్ (DD)కేసులు నమోదుకాగా ఈ యేడాది 17,627 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. ఇక హెల్మెట్ లేకుండా ప్రయాణించిన వారిపై రూ.2.77 లక్షల కేసులు నమోదు చేశారు. ఓవర్ స్పీడ్ కేసులు 41,128, సెల్ఫోన్ డ్రైవ్ చేస్తూ నమోదైన కేసులు 2643 నమోదయ్యాయి. మైనర్ డ్రైవింగ్ కేసులు 1087 నమోదు చేశారు.
News December 31, 2025
90 కేసుల్లో 211 మంది అరెస్ట్: నిజామాబాద్ CP

డ్రగ్స్ నిర్మూలన విషయంలో కఠినంగా వ్యవహరించామని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. జిల్లాలో 2025లో 90 కేసులు నమోదుకాగా మొత్తం 211 మంది నిందితులను అరెస్టు చేశామన్నారు. 15,644 కిలోల గంజాయి, 35,960 కిలోల ఆల్ఫాజోలం స్వాధీనం చేసుకున్నారు. గతేడాది 23 డ్రగ్స్ కేసులు నమోదు కాగా ఈ 2025 90 కేసులు నమోదయ్యాయని వివరించారు.
News December 31, 2025
NZB: నూతన కలెక్టర్ ఇలా త్రిపాఠి నేపథ్యమీదే!

నిజామాబాద్ నూతన కలెక్టర్‌గా నియమితులైన ఇలా త్రిపాఠి UP లక్నోకు చెందిన వారు. ఢిల్లీలోని జేపీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో 2013లో బీటెక్ పూర్తి చేశారు. ఆ తరువాత లండన్ వెళ్లారు. అక్కడ లండన్ స్కూల్ ఎకనామిక్స్‌లో చదివారు. రెండో అటెంప్ట్ 2017లో సివిల్స్ సాధించారు. ఆమె భర్త భవేశ్ మిశ్రా కూడా IAS అధికారి. ఆమె ములుగులో పని చేసి టూరిజం డైరెక్టర్‌గా వెళ్లారు. తదుపరి నల్గొండ కలెక్టర్‌గా పని చేశారు.


