News June 30, 2024

కాకినాడలో విషాదం.. 14ఏళ్ల బాలిక ఆత్మహత్య

image

కాకినాడలోని గాంధీనగర్‌కు చెందిన 14ఏళ్ల విద్యార్థిని 8వ తరగతి చదువుతోంది. ఆ బాలిక ఫోన్ ఎక్కువగా మాట్లాడుతుందని ఆమె సోదరుడు మందలించడంతో మనస్తాపం చెంది ఇంట్లో శనివారం ఉరి వేసుకుంది. అపస్మారక స్థితిలో ఉన్న బాలికను చికిత్స కోసం కాకినాడ జీజీహెచ్‌కు తీసుకెళ్లారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు 2 టౌన్ SI చినబాబు కేసు నమోదు చేశారు.

Similar News

News March 5, 2026

మీరు చేసే పనులపై CM నిఘా.. కలెక్టర్ ఏం చెప్పారంటే?

image

CM చంద్రబాబు జిల్లాల పనితీరును నేరుగా పర్యవేక్షిస్తున్నారని కలెక్టర్ కీర్తి చేకూరి గురువారం తెలిపారు. అధికారులు మరింత బాధ్యతాయుతంగా, జవాబుదారీతనంతో పనిచేయాలని ఆదేశించారు. పౌర సేవలు, సంక్షేమ పథకాల అమలు, ఫిర్యాదుల పరిష్కారంపై క్రమం తప్పకుండా విశ్లేషణ జరుగుతోందని స్పష్టం చేశారు. ఒక టీంగా పనిచేసి ప్రజలకు మెరుగైన ఫలితాలు అందించాలని యంత్రాంగాన్ని కోరారు.

News March 5, 2026

తూ.గో: అగ్నివీర్ నియామకాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

విశాఖపట్నం ఆర్మీ రిక్రూటింగ్ కార్యాలయం ద్వారా అగ్నివీర్ నియామకాలకు ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి గురువారం తెలిపారు. అవివాహిత పురుష అభ్యర్థులు ఈనెల 13 నుంచి వచ్చే నెల 1వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. ఆసక్తి గల జిల్లా అభ్యర్థులు Join Indian Army అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు.

News March 5, 2026

నేటి నుంచి జిల్లాలో జాతీయ ఎస్సీ కమిషన్ ఛైర్మన్ పర్యటన

image

జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ ఛైర్మన్ కిషోర్ మక్వానా మార్చి 6 నుంచి 8 వరకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారని కలెక్టర్ కీర్తి చేకూరి గురువారం తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఆయన రాజమండ్రి చేరుకుంటారు. శనివారం ఎస్సీల సంక్షేమం, రక్షణాత్మక చర్యలపై సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం కోనసీమ జిల్లాకు వెళతారు. పర్యటన ఏర్పాట్లను పక్కాగా పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.