News June 30, 2024
విశాఖ: రైల్వే స్టేషన్‌లో 21 కిలోల గంజాయి స్వాధీనం

విశాఖ రైల్వే స్టేషన్‌లో జీఆర్‌పీ పోలీసులు శనివారం 21 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రైల్వే స్టేషన్‌లో తనిఖీలు నిర్వహిస్తుండగా ఒడిశా రాష్ట్రం కొరాపుట్ ప్రాంతానికి చెందిన శివ పాత్రో అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించాడు. అతని వద్ద తనిఖీ చేయగా 21 కిలోల గంజాయి లభించింది. దీనిని విశాఖ నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు నిందితుడు వెల్లడించినట్లు జీఆర్‌పీ ఏఎస్ఐ మనోహర్ తెలిపారు.
Similar News
News September 18, 2025
సాధారణ భక్తులకు ఇబ్బందులు కలగకూడదు: VZM కలెక్టర్

శ్రీ పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు ప్రతి ఒక్కరి మదిలో పవిత్రంగా నిలిచిపోయేలా నిర్వహించాలని, పండగ శోభ ప్రతిబింబించాలని జిల్లా కలెక్టర్ ఎస్.రామ్ సుందర్ రెడ్డి తెలిపారు. పండగ ఏర్పాట్లపై కలెక్టర్ గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్షించారు. సిరిమాను పవిత్రతను కాపాడుతూ భక్తుల మనోభావాలకు అనుగుణంగా నిర్వహించాలన్నారు. VIP దర్శనాలు వలన సాధారణ భక్తులకు ఇబ్బంది కలగకూడదన్నారు.
News September 18, 2025
పూసపాటిరేగ: వేటకు వెళ్లి మృతి

పూసపాటిరేగ మండలం పెద్దూరుకు చెందిన ఓ మత్స్యకారుడు వేటకు వెళ్లి మృతి చెందాడు. ఈ ఘటనపై స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మత్స్యకారుడైన బి.రాము బుధవారం వేటకు వెళ్లగా.. చేపల కోసం వల వేసే క్రమంలో జారి పడిపోయాడు. అక్కడున్నవారు కాపాడే ప్రయత్నం చేసినా ఫలించలేదు. ఈ ఘటనపై మెరైన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News September 17, 2025
ఈనెల 19న ఉద్యోగుల కోసం గ్రీవెన్స్: కలెక్టర్

ఈ నెల 19వ తేదీ శుక్రవారం ఉద్యోగుల కోసం ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎస్.రామసుందర్ రెడ్డి బుధవారం తెలిపారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో ఈ కార్యక్రమంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొంటారని వెల్లడించారు. ఉద్యోగులు తమ సమస్యలపై ఈ గ్రీవెన్స్‌లో ధరఖాస్తులను అందజేయవచ్చునని సూచించారు. ప్రతి 3వ శుక్రవారం కార్యక్రమం జరుగుతుందన్నారు.