News June 30, 2024
భారత్‌కు ICC ప్రైజ్ మనీ ఎంతో తెలుసా!

➥టీ20 WC 2024 ప్రైజ్‌మనీ: దాదాపుగా రూ.93.50 కోట్లు
➥టోర్నీ ఛాంపియన్ భారత్‌కు రూ.20.42 కోట్లు, రన్నరప్ SAకు రూ.10.67 కోట్లు
➥సెమీస్‌లో ఓడిన AFG, ENG జట్లకు చెరో రూ.6.56కోట్లు,
➥సూపర్ 8లో ఓడిన USA, WI, AUS, BAN టీమ్‌లకు రూ.3.17 కోట్ల చొప్పున
➥9 నుంచి 12వ ర్యాంకు టీమ్‌లకు రూ.2.5 కోట్లు
➥13 నుంచి 20వ ర్యాంకు జట్లకు రూ.1.87కోట్లు
➥➥గెలిచిన ఒక్కో మ్యాచ్‌కు రూ.26 లక్షలు అదనం
Similar News
News January 23, 2026
RCBని కొనుగోలు చేయనున్న అనుష్క?

RCB ఫ్రాంచైజీలో వాటా దక్కించుకోవడానికి విరాట్ కోహ్లీ భార్య, నటి అనుష్క శర్మ ప్రయత్నాలు చేస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అందుకోసం ఆమె బిడ్ వేయనున్నట్లు వార్తలొస్తున్నాయి. రూ.400 కోట్లు వెచ్చించి 3% వాటా కొనాలని చూస్తున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం కోహ్లీ RCB తరఫున ఆడుతున్నారు. అటు ఈ ఫ్రాంచైజీ కోసం బిడ్ వేస్తానని అదర్ పూనావాలా <<18930355>>ఇప్పటికే<<>> ప్రకటించారు.
News January 23, 2026
‘బంగ్లాదేశ్ కథ ముగిసినట్లే’.. నిరాశలో క్రికెటర్లు

T20 WC నుంచి BAN వైదొలగడంపై ఆ దేశానికి చెందిన పలువురు క్రికెటర్లు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని మండిపడుతున్నారు. T20 కెప్టెన్ లిటన్ దాస్, టెస్ట్ కెప్టెన్ షాంటో టోర్నీలో ఆడేందుకు సిద్ధమని చెప్పినా, వారి మాటకు విలువ ఇవ్వలేదని సమాచారం. ‘బంగ్లా క్రికెట్ ముగిసినట్లే’ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
News January 23, 2026
VHP నేతపై దాడి.. ఉజ్జయినిలో చెలరేగిన హింస

మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో హింస చెలరేగింది. విశ్వహిందూ పరిషత్‌కు చెందిన నాయకుడిపై దాడి జరిగిన నేపథ్యంలో అల్లర్లు చెలరేగినట్టు తెలుస్తోంది. పలు బస్సులకు నిప్పుపెట్టిన అల్లరిమూకలు ఇళ్లపై రాళ్లతో దాడి చేశాయి. దీంతో ఉజ్జయినిలో పోలీసులు నిషేధాజ్ఞలు విధించారు.


