News June 30, 2024

మీలాంటి అధికారులే దేశానికి కావాల్సింది!

image

TG: 2024 బ్యాచ్ ట్రైనీ AIS(All India Services)లు మంచి మనసు చాటుకున్నారు. వారి ట్రావెలింగ్ అలవెన్స్ రూ.1.30లక్షలను ‘సుకన్య సమృద్ధి’కి అందించారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన 65 మంది ట్రైనీ AISలు HYDలో 100 మంది బాలికలకు ఖాతాలు తెరిపించి ₹1000 చొప్పున జమ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థినులందర్నీ ‘బాలికా సుకన్య సమృద్ధి యోజన’లో చేర్చడమే లక్ష్యంగా కార్యాచరణ ప్రారంభించారు.

Similar News

News September 20, 2024

కల్తీ నెయ్యి వ్యవహారమంతా కట్టు కథ: జగన్

image

AP: చంద్రబాబు అనే వ్యక్తి దుర్మార్గుడని YS జగన్ ధ్వజమెత్తారు. ‘దేవుడిని కూడా రాజకీయాల్లోకి లాగాలనే వ్యక్తి ప్రపంచ చరిత్రలో ఎవరూ ఉండరు. 100 రోజుల చంద్రబాబు పాలనపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. అందుకే తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ పేరుతో డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు. కల్తీ నెయ్యి వ్యవహారమంతా ఓ కట్టు కథ. కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా చంద్రబాబు మాట్లాడారు’ అని జగన్ మండిపడ్డారు.

News September 20, 2024

తిరుమల ఆలయ ప్రతిష్ఠను కాపాడాలి: టీటీడీ ఈఓ

image

AP: తిరుమల ఆలయ ప్రతిష్ఠను భక్తులు, ప్రజలు కాపాడాలని టీటీడీ ఈఓ శ్యామలరావు కోరారు. శ్రీవారి లడ్డూ వివాదంపై ఈఓ స్పందించారు. ‘రికార్డుల్లో లడ్డూ తయారీకి స్వచ్ఛమైన నెయ్యిని వాడాలని ఉంది. నెయ్యి నాణ్యతను పరీక్షించే పరికరాలను గుజరాత్‌లోని ఎన్‌డీడీబీ విరాళంగా ఇచ్చింది. వాటితోనే నెయ్యి నాణ్యతను పరీక్షిస్తున్నాం. బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై చర్చిస్తున్నాం’ అని ఆయన పేర్కొన్నారు.

News September 20, 2024

జంతువుల కొవ్వు నెయ్యిలో కలిసింది: టీటీడీ ఈవో

image

తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి AR డెయిరీ సరఫరా చేసిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసినట్లు NDDB రిపోర్టు తేల్చిందని TTD EO శ్యామలరావు ప్రకటించారు. నెయ్యిపై అనుమానంతో జులై 6న 2 ట్యాంకర్లను ల్యాబ్‌కు పంపితే నాణ్యత లేదని తేలిందన్నారు. తీవ్ర కల్తీ జరిగిందని తేలిన వెంటనే చర్యలు చేపట్టామన్నారు. వెంటనే AR డెయిరీ నెయ్యిని వాడటం ఆపేశామన్నారు. బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై కమిటీ వేశామన్నారు.