News June 30, 2024

వీఎస్‌యూ ఇన్‌ఛార్జ్ రిజిస్ట్రార్‌గా సునీత

image

నెల్లూరు జిల్లా విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌గా పనిచేసిన రామచంద్రారెడ్డి రెండేళ్ల పదవీ కాలం నిన్నటితో ముగిసింది. దీంతో ఆయన కడపలోని యోగి వేమన యూనివర్సిటీకి వెళ్లారు. దీంతో ఇన్‌ఛార్జ్ రిజిస్ట్రార్‌గా కె.సునీత యూనివర్సిటీ పరిపాలనా భవనంలో శనివారం భాధ్యతలు స్వీకరించారు. బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు సునీతను సన్మానించారు. 

Similar News

News January 1, 2026

నెల్లూరు: ఇవాళ మీకు సెలవు ఇచ్చారా?

image

నెల్లూరు జిల్లాలో న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరిగాయి. చాలామంది ఇవాళ దేవాలయాలు, ప్రార్థనా మందిరాలకు వెళ్తుంటారు. ఈనేపథ్యంలో ఆప్షన్ లీవ్ వాడుకోవచ్చు. ఏడాదికి 5ఆప్షన్ హాలిడేస్ ఉంటాయి. జిల్లాలోని కొన్ని స్కూళ్లు, కాలేజీలకు గురువారం సెలవు ఇచ్చారు. మీకు సెలవు ఇచ్చారా? లేదా? కామెంట్ చేయండి.

News December 31, 2025

నెల్లూరు : 2 నుంచి రీ సర్వే

image

నెల్లూరు జిల్లాలో నాలుగో విడత భూముల రీసర్వే ప్రక్రియ జనవరి 2వ తేదీ నుంచి మొదలవుతోంది. AP రీసర్వే ప్రాజెక్టులో జిల్లా నందు 93 గ్రామాలు ఎంపిక చేశారు. ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ నుంచి 26 గ్రామాలు, కావలి డివిజన్ నుంచి 26, గూడూరు డివిజన్ నుంచి 14, నెల్లూరు డివిజన్ 27 గ్రామాలు కలిపి 357270.62 ఎకరములు రీసర్వే చేయనున్నారు. రైతులు రీసర్వేలో పాల్గొనాలని జేసీ వెంకటేశ్వర్లు, DD వై.నాగశేఖర్ కోరారు.

News December 31, 2025

నెల్లూరు: సాగులో సమస్యలా.. ఈ నంబర్లకు కాల్ చేయండి

image

జిల్లాలో సాగు సమస్యలు వస్తే ఎవరిని సంప్రదించాలి.. ఏ మందులు వాడాలి.. సస్యరక్షణ చర్యలు ఏంటి.. ఎరువులు ఏ మొతాదులో వేయాలి.. వంటి సమస్యలకు వ్యవసాయశాఖ కొన్ని ఫోన్ నంబర్లను అందుబాటులోకి తీసుకోచ్చింది.
-వరి, పప్పు ధాన్యాలు, నూనె గింజలు : 0861-2327803, 9490327424
-వేరుశనగ : 9440566582
-ఉద్యాన, వ్యవసాయ పంటలు(తెగుళ్లు : 0861-2349356, 9490004254
– ఉద్యానపంటలు: 7995088181 (ఉద్యాన శాఖ )