News June 30, 2024

టీమ్ ఇండియాకు మోదీ ఫోన్ కాల్

image

టీ20 వరల్డ్ కప్ సాధించిన భారత జట్టుకు ప్రధాని మోదీ ఫోన్ కాల్ చేశారు. టీమ్ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అద్భుత నాయకత్వం వహించిన రోహిత్ శర్మను, గొప్ప ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లీని ప్రత్యేకంగా ప్రశంసించారు. చివరి ఓవర్‌లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన హార్దిక్ పాండ్యను, అద్భుతమైన క్యాచ్ పట్టిన సూర్యకుమార్‌ను అభినందించారు. రాహుల్ ద్రవిడ్‌‌ కోచింగ్‌ను మోదీ కొనియాడారు.

Similar News

News January 23, 2026

మున్సిపల్ పోరుకు ముహూర్తం: 28న ఎన్నికల షెడ్యూల్?

image

TG: మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్ మొదలైంది. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించేందుకు SEC సిద్ధమైంది. ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల ఎంపిక వంటి పనులన్నీ పూర్తయ్యాయి. ఈ నెల 27న ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి.. మరుసటి రోజే అంటే జనవరి 28న ఎన్నికల షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. మార్చిలోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

News January 23, 2026

సిట్ విచారణకు వెళ్లే ముందు KTR ప్రెస్ మీట్

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మాజీ మంత్రి, BRS కీలక నేత KTR నేడు ఉదయం 11 గంటలకు సిట్ విచారణకు హాజరుకానున్నారు. అంతకుముందు 9:30 గంటలకు ఆయన తెలంగాణ భవన్‌కు చేరుకోనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ నేతలతో సమావేశం అనంతరం 10 గంటలకు ప్రెస్‌మీట్ నిర్వహించనున్నట్లు వెల్లడించాయి. ఇదే కేసులో మరో కీలక నేత హరీశ్‌రావును ఇటీవలే సిట్ విచారించిన విషయం తెలిసిందే.

News January 23, 2026

శీతాకాలంలో పసిపిల్లల సంరక్షణ

image

శీతాకాలంలో నవజాత శిశువులను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. బిడ్డకు ఎప్పుడూ వెచ్చగా ఉండే దుస్తులు వేయాలి. సమయానికి తల్లిపాలు ఇవ్వడం చాలా ముఖ్యం. ఉదయం స్నానం చేయించిన తర్వాత బిడ్డను కాసేపు ఎండలో కూర్చోనివ్వాలి. చల్లని గాలి పడకుండా చూడాలి. ఫ్యాన్ లేదా ఏసీకి దూరంగా ఉంచాలి. ఏవైనా ఆరోగ్య సమస్యల లక్షణాలు కనిపిస్తే ఇంట్లో మందులు వేసి సొంత వైద్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.