News June 30, 2024

17 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా

image

భారత్‌తో ఏకైక టెస్టులో సౌతాఫ్రికా కేవలం 17 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. 236/4తో 3వ రోజు ఆట ప్రారంభించిన సఫారీ జట్టు 249 దగ్గర 5వ వికెట్ కోల్పోగా 266 రన్స్‌కే ఆలౌటై ఫాలోఆన్‌లో పడింది. 2వ ఇన్నింగ్స్‌లో 16/1గా ఉన్న ఆ జట్టు ఇంకా 321 రన్స్ వెనకబడి ఉంది. భారత స్పిన్నర్ స్నేహ్ రాణా 8/77తో సఫారీల నడ్డి విరిచారు. అద్భుతం జరిగితే తప్ప భారత్‌ గెలుపును సౌతాఫ్రికా అడ్డుకోలేదు.

Similar News

News January 31, 2026

సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీలో పోస్టులు

image

<>సెంటర్<<>> ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ 9 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు ఫిబ్రవరి 28 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో BE/BTech/MSc/ME/MTech/PhD, MBA/PGDM/MMS/MCom, BCom, పీజీ అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. రాత పరీక్ష/ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్/ ట్రేడ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://cmet.gov.in

News January 31, 2026

సిట్ విచారణకు కేసీఆర్?

image

TG: ఫోన్ ట్యాపింగ్ అంశంలో సిట్ విచారణకు హాజరుకావాలని మాజీ సీఎం కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. రేపు నందినగర్‌ నివాసంలో విచారణ జరగనున్నట్లు తెలుస్తోంది. కాగా ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లోనే విచారించాలని కేసీఆర్ చేసిన వినతిని సిట్ తిరస్కరించిన <<19006789>>విషయం తెలిసిందే<<>>. మరోవైపు కేసీఆర్‌కు సిట్ నోటీసులకు నిరసనగా బీఆర్ఎస్ శ్రేణులు రేపు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేయనున్నాయి.

News January 31, 2026

28,740 పోస్టులకు నోటిఫికేషన్

image

పోస్టాఫీసుల్లో 28,740 ఉద్యోగాలకు ఇండియన్ పోస్టల్ డిపార్ట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రామీణ డాక్ సేవక్, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పోస్టులను భర్తీ చేయనుంది. అభ్యర్థులు నేటి నుంచి FEB 14వరకు అప్లై చేసుకోవచ్చు. టెన్త్ ఉత్తీర్ణత, 18-40 ఏళ్ల వయసున్న వారు అర్హులు. మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
సైట్: https://indiapostgdsonline.gov.in/