News June 30, 2024

కడప: ITIలలో రెండో విడత అడ్మిషన్లు ప్రారంభం

image

జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలలో 2వ విడత అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైనట్లు ప్రభుత్వ మైనాటీల ఐటీఐ జిల్లా కన్వీనర్, ప్రిన్సిపల్ ఎం.జ్ఞానకుమార్ తెలిపారు. విద్యార్థులు 10వ తరగతి పాస్/ఫెయిల్, ఇంటర్ పాస్/ఫెయిల్ ఆపై విద్యార్హతలు కలిగిన వారు కూడా అడ్మిషన్లను పొందవచ్చని ఆయన తెలిపారు. అభ్యర్థులు తమ అప్లికేషను ఆన్లైన్ ద్వారా iti.ap.gov.in అనే వెబ్‌సైట్‌లో తమ వివరాలను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు.

Similar News

News October 8, 2024

‘వైఎస్సార్ జిల్లా పేరును మార్చడం తగదు’

image

వైఎస్సార్ జిల్లా పేరును కడప జిల్లాగా మార్చాలని ప్రభుత్వం ప్రయత్నించడం తగదని వైసీపీ జిల్లా వైసీపీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన కడపలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన సేవలు వెలకట్టలేనివని, ఆ సేవలకు గుర్తింపుగానే ఆయన పేరు పెట్టారన్నారు. కడప జిల్లాగా పేరు మార్చాలని పక్క జిల్లాకు చెందిన మంత్రి సీఎంకు లేఖ రాయడం హేయమైన చర్య అన్నారు.

News October 8, 2024

రాజంపేటలో భగ్గుమంటున్న కూరగాయల ధరలు

image

రాజంపేట పట్టణంలో కూరగాయల ధరలు ఆకాశన్నంటుతుండడంతో కొనుగోలుదారులు లబోదిబోమంటున్నారు. మంగళవారం టమాటా, ఎర్రగడ్డలు రూ.100 కి దగ్గరగా ఉన్నాయి. మిగిలిన కూరగాయల పరిస్థితి అదే లాగా ఉందని చెబుతున్నారు. రోజురోజుకీ కూరగాయల ధరలు ఇలా పెరుగుతుండడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

News October 8, 2024

కడప – హైదరాబాదుకు రోజువారీ సర్వీసులు

image

కడప- హైదరాబాదుకు విమానయాన ఇండిగో సంస్థ రెగ్యులర్ సర్వీసులు నడపనుంది. ఈనెల 27న హైదరాబాదులో ఉదయం11.30 గంటలకు బయలుదేరి, మ.12.40కి కడపకు చేరుతుంది. మళ్లీ కడపలో సా. 3.55 కి తిరుగుపయనమై సా.5.10కి హైదరాబాదు చేరుతుంది. www.goindigo.in వెబ్ సైట్‌లో టికెట్లు బుక్ చేసుకోవాలి సంస్థ తెలిపింది.