News June 30, 2024

దర్శి: అమ్మమ్మ ఇంటికి వచ్చి తనువు చాలించిన చిన్నారులు

image

దర్శి మండలంలోని తూర్పు వీరయ్య పాలెంలో ప్రమాదవశాత్తు వాగులో పడి మృతి చెందిన చిన్నారుల వివరాలను పోలీసులు గుర్తించారు. పొదిలి మండలం వేలూరు గ్రామానికి దర్నాసి విరమణికంఠ (10)కాగా, అద్దంకి మండలంలోని వేల మురిపాడుకు చెందిన పులిమి రాఘవ (12) చెందిన బాలురుగా గుర్తించారు. చిన్నారులు తూర్పు వీరయపాలెంలోని అమ్మమ్మ ఇంటికి రాగా ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. దీంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.

Similar News

News January 21, 2026

ప్రకాశం: గీతిక.. నువ్వు సూపర్!

image

ప్రకాశం జిల్లా కొండపి మండలం జాల్లపాలెం పాఠశాల విద్యార్థిని రాసిన పుస్తకానికి రాష్ట్రస్థాయిలో గుర్తింపు దక్కింది. హెచ్ఎం మంచికల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. 10వ తరగతి చదువుతున్న గీతిక 8వ తరగతిలో రాసిన కథలు, కవితలతో కూడిన పుస్తకాన్ని ‘వేదన’ పేరిట ప్రచురించారు. రచనవి భాగంలో పాఠశాల గ్రంథాలయాలకు దీపిక రాసిన పుస్తకం ఎంపికైనట్లు HM చెప్పారు.

News January 20, 2026

ఒంగోలు SP కీలక ఆదేశాలు

image

మహిళలు, చిన్నారుల రక్షణే లక్ష్యంగా శక్తి బృందాలు క్షేత్రస్థాయిలో మరింత పటిష్ఠంగా పని చేయాలని ప్రకాశం ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు సూచించారు. ఒంగోలులోని తన కార్యాలయంలో డీఎస్పీలు, శక్తి బృందాలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. బస్టాండ్లు, ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్లు, ఈవ్ టీజింగ్ జరుగుతున్న ప్రదేశాల్లో ఏ సమస్య ఎదురైనా త్వరగా వెళ్లాలని ఆదేశించారు.

News January 20, 2026

ప్రకాశం జిల్లా కలెక్టర్‌కు అవార్డు

image

ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజబాబుకు ప్రత్యేక అవార్డు దక్కింది. ఓటర్ల మ్యాపింగ్‌లో సాధించిన పురోగతికి బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డుకు ఆయనను ఎంపిక చేశారు. 2002 ఎస్ఐఆర్ డేటాతో 2026 ఎస్ఐఆర్ డేటాను సరిపోలడంలో కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఈనెల 25న విజయవాడలో జరిగే కార్యక్రమంలో ఆయన అవార్డు అందుకోనున్నారు.