News June 30, 2024

బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరపాలి: మత్స్యకార జేఏసీ

image

మత్స్యకార సొసైటీలకు గతంలో వలే కాకుండా బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని మత్స్యకార జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు కంబాల అమ్మోరయ్య, ప్రధాన కార్యదర్శి పిక్కి.కొండలరావు విజ్ఞప్తి చేశారు. ఏపీ మత్స్యకార ఎన్నికల అధికారికి వినతి పత్రం అందిస్తున్నట్లు నక్కపల్లిలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో తెలిపారు. చేతులెత్తే పద్ధతి ద్వారా మత్స్యకారులు మధ్య గొడవలు జరిగి శాంతిభద్రతలకు భంగం వాటిల్లుతున్నట్లు తెలిపారు.

Similar News

News September 16, 2025

నేటి నుంచి జీవీఎంసీ కార్పొరేటర్ల అధ్యయన యాత్ర

image

జీవీఎంసీ కార్పొరేటర్లు మంగళవారం అధ్యయన యాత్రలో పాల్గొననున్నరు. ఈ ప్రయాణంలో భాగంగా రేపు జైపూర్ మున్సిపల్ కార్పొరేషన్‌ను సందర్శించనున్నారు. అనంతరం ఆజ్మీర్, జోద్‌పూర్ నగరాల్లో పర్యటించి పట్టణ అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలిస్తారు. కార్పొరేటర్ల బృందం ఈనెల 24న తిరిగి విశాఖకి చేరుకుంటుంది.

News September 16, 2025

విశాఖ: 19న జాబ్ మేళా

image

కంచరపాలెం నేషనల్ కెరీర్ సర్వీస్ సెంటర్ (ఎన్‌సీఎస్‌సీ)లో ఈనెల 19న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రాంతీయ ఉపాధి కల్పనాధికారి శ్యాం సుందర్ తెలిపారు. బీపీవో, రిలేషిప్ మేనేజర్, టెలీకాలింగ్ ఆపరేటర్‌ విభాగాల్లో సుమారు 100 ఉద్యోగాలకు డ్రైవ్ చేపడుతున్నట్లు చెప్పారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, ఎంబీఏ పాస్ అయిన నిరుద్యోగులు అర్హులుగా పేర్కొన్నారు. 19న ఉదయం 10 గంటలకు తమ సర్టిఫికెట్స్‌తో హాజరుకావాలని కోరారు.

News September 15, 2025

విశాఖ సీపీ కార్యాలయానికి 115 ఫిర్యాదులు

image

ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో భాగంగా పోలీస్ కమీషనరేట్‌లో సోమవారం 115 ఫిర్యాదులు వచ్చాయని కమిషనర్ శంఖబ్రత బాగ్చీ తెలిపారు. ఫిర్యాదుదారులతో నేరుగా ఆయన మాట్లాడి, వారి సమస్యలను తెలుసుకున్నారు. సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్‌లో, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి చట్టపరంగా సమస్య పరిష్కారించాలని ఆదేశించారు. పీజీఆర్ఎస్‌లో ఒకసారి నమోదైన ఫిర్యాదు పునరావృతం కాకుండా చూడాలన్నారు.