News June 30, 2024
BIG BREAKING: T20 క్రికెట్‌కు జడేజా వీడ్కోలు

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ బాటలోనే ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అంతర్జాతీయ T20 క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. ‘కృతజ్ఞతతో నిండిన హృదయంతో టీ20లకు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నా. ఇన్నేళ్లూ గర్వంతో దూసుకెళ్లే గుర్రంలా నా దేశం కోసం అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చా. ఇకపై ఇతర ఫార్మాట్లలో నా జర్నీ కొనసాగిస్తా. T20WC గెలవడమనే నా కల నిజమైంది. ఇది నా కెరీర్‌లో అత్యున్నత ఘనత’ అని ఇన్‌స్టాలో రాసుకొచ్చారు.
Similar News
News November 6, 2025
భారత్ బ్యాటింగ్.. టీమ్స్ ఇవే

క్వీన్స్‌లాండ్‌లో జరుగుతున్న నాలుగో T20లో ఆసీస్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
IND: అభిషేక్, గిల్, సూర్య (C), తిలక్, అక్షర్, సుందర్, జితేశ్ శర్మ, దూబే, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా.
AUS: మార్ష్ (C), షార్ట్, ఇంగ్లిస్, టిమ్ డేవిడ్, ఫిలిప్, స్టాయినిస్, మ్యాక్స్‌వెల్, డ్వార్షియస్, బార్ట్‌లెట్, ఇల్లిస్, జంపా.
News November 6, 2025
DANGER: CT స్కాన్ చేయిస్తున్నారా?

ఏదైనా చిన్న సమస్యతో ఆస్పత్రికి వెళ్తే సీటీ స్కాన్, MRIలను వైద్యులు సజెస్ట్ చేస్తుంటారు. అయితే CT స్కాన్‌ల నుంచి వెలువడే రేడియేషన్ వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భవిష్యత్తులో వచ్చే మొత్తం క్యాన్సర్ సంఖ్యల్లో CT స్కాన్ క్యాన్సర్లు 5 శాతానికి చేరొచ్చని అమెరికాలో జరిగిన అధ్యయనంలో తెలిసినట్లు పేర్కొన్నారు. CT స్కాన్‌ల వినియోగం, డోసులు తగ్గించకపోతే ప్రమాదమేనంటున్నారు.
News November 6, 2025
BBL: ఆ బంతులు ప్రేక్షకులకే!

ఆస్ట్రేలియాలో జరిగే BBL, WBBL టోర్నీల్లో కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. బ్యాటర్ 6 లేదా 4 కొట్టిన బంతి ప్రేక్షకుల వద్దకు వెళితే దాన్ని వాళ్లు తీసుకెళ్లొచ్చు. అయితే ఇన్నింగ్స్ ఫస్ట్ ఓవర్‌కే ఇది వర్తిస్తుంది. ఆ ఓవర్‌లో ఎన్నిసార్లు కొట్టినా సరే బంతిని మారుస్తారు. మరోవైపు బాల్‌ను ప్రేక్షకులు తీసుకోకపోయినా రెండో ఓవర్ నుంచి కొత్తది వాడనున్నారు. ఆలస్యం జరగకుండా అంపైర్లు తమ వద్ద కొన్ని ఉంచుకోనున్నారు.


