News June 30, 2024
మంత్రి సంధ్యారాణికి ట్రైబల్ వెల్ఫేర్ టీచర్స్ వినతి

గిరిజన ఆశ్రమ పాఠశాలలను జూనియర్ కళాశాలలుగా అప్‌గ్రేడ్ చేయాలని మంత్రి గుమ్మిడి సంధ్యారాణికి ట్రైబల్ వెల్ఫేర్ టీచర్స్ ఆదివారం వినతి పత్రం అందజేశారు. జీవోనం-3 ప్రకారం స్పెషల్ డీఎస్సీ నిర్వహించాలని, గి.సం.శాఖకు మంజూరైన డీఈవో, డివైఈవో పోస్టులను భర్తీ చేయాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో 420 పండిట్ పోస్టులు అప్‌గ్రేడ్ జరిగేలా చూడాలని కోరారు. వారి వినతిపై మంత్రి సానుకూలంగా స్పందించారు.
Similar News
News January 10, 2026
VZM: పోలీసు కుటుంబాలతో సంక్రాంతి సంబరాలు

ఈనెల 13న జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో పోలీసు కుటుంబాలతో సంక్రాంతి వేడుకలు జరుపుకుంటున్నట్లు ఎస్పీ దామోదర్ తెలిపారు. ముగ్గుల పోటీలు, ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, భోగి మంటలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. పోలీసు మహిళా ఉద్యోగినులు ప్రత్యేకంగా పాల్గొని ప్రథమ, ద్వితీయ, తృతీయ, కన్సోలేషన్ బహుమతులు పొందవచ్చు అన్నారు. ఆరోజు ఉదయం 8 గంటలకు ముగ్గుల సామగ్రితో మైదానంలో హాజరు కావాలని ఎస్పీ ఆహ్వానించారు.
News January 9, 2026
100% ఓడీఎఫ్ గ్రామాలుగా ప్రకటించాలి: VZM కలెక్టర్

విజయనగరం జిల్లాలోని అన్ని గ్రామాలను నిర్దేశిత గడువులో 100% ఓడీఎఫ్ గ్రామాలుగా ప్రకటించాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఓడీఎఫ్ డిక్లరేషన్‌లో వెనుకబడి ఉన్న మండలాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, పెండింగ్‌లో ఉన్న వెరిఫికేషన్ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని ఆయన సూచించారు. గతంలో నీటి సమస్యలు, వ్యాధులు ఉన్న గ్రామాలపై ప్రత్యేక నివేదిక ఇవ్వాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను శుక్రవారం కోరారు.
News January 9, 2026
VZM: ‘ఉపాధి హామీ పని దినాలు పెరుగుతాయి’

వీబీ జీ రామ్ జీ ద్వారా గ్రామీణ ప్రజలకు విస్తృత ఆర్థిక లబ్ధి చేకూరుతుందని MGNREGS డైరెక్టర్ షణ్ముఖ్ తెలిపారు. స్థానిక ఓ హోటల్‌లో శుక్రవారం నిర్వహించిన మీడియా వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడారు. ఈ పథకం అమలుకు విజయనగరం జిల్లాను పైలట్‌గా ఎంపిక చేసినట్లు చెప్పారు. ఉపాధి హామీ పనిదినాలు 100 నుంచి 125కి పెరుగుతాయన్నారు. ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


