News June 30, 2024
ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు: పెమ్మసాని

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని ధన్యవాదాలు తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం రూ.7వేల చొప్పున రాష్ట్రంలోని 65 లక్షల మందికి సోమవారం నుంచి పింఛన్లు అందజేయడం పై హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఖజానాలో నిధులు లేకపోయినా, ఇచ్చిన మాటకు కట్టుబడి పెన్షన్ అందజేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు కేంద్ర సహాయక మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కృతజ్ఞతలు తెలియజేశారు.
Similar News
News July 5, 2025
తెనాలి: మళ్లీ పెరుగుతున్న టమాటా ధరలు

ఇటీవల తగ్గిన కూరగాయల ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ముఖ్యంగా టమాటా ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. రెండు రోజుల కిందట రైతు బజార్లలో కిలో రూ.18 ఉన్న టమాటా శనివారానికి రూ.33కి చేరింది. రిటైల్ మార్కెట్‌లో ఈ ధర మరింత అధికంగా ఉంది. పచ్చిమిర్చి రూ.40, వంకాయ రూ.34, దొండ రూ.36, బెండ రూ.24 పలుకుతున్నాయి. మీ ప్రాంతాల్లో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
News July 4, 2025
GNT: సీలింగ్ భూముల క్రమబద్ధీకరణపై జేసీ సమీక్ష

సీలింగ్ భూములు క్రమబద్ధీకరణ చేసుకోవాల్సిన వారు ఈ ఏడాది డిసెంబర్ 31లోపు దరఖాస్తు చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఏ.భార్గవ్ తేజ సూచించారు. కాంపిటెంట్ అథారిటీ, అర్బన్ ల్యాండ్ సీలింగ్స్ అధికారులతో కలిసి తహశీల్దార్‌లు, సర్వేయర్‌లతో గుంటూరు కలెక్టరేట్‌లో జేసీ శుక్రవారం సమీక్ష చేశారు. సీలింగ్ భూముల క్రమబద్ధీకరణ కోసం గతంలో వచ్చిన అర్జీలపై విచారణ జరిపి అధికారులు నివేదికలను సమర్పించాలని ఆదేశించారు.
News May 8, 2025
గుంటూరు మిర్చి యార్డ్‌లో నేటి ధరలివే.!

గుంటూరు మిరప మార్కెట్‌కు గురువారం 55,000 బస్తాల దిగుబడి నమోదైంది. వివిధ రకాల మిరప ధరలు ఇలా ఉన్నాయి. తేజా బెస్ట్ రూ.80-125, సూపర్ డీలక్స్ రూ.130. భెడిగి రకాలు (355, 2043) రూ.80-120 మధ్య, 341 బెస్ట్ రూ.80-130 మధ్య ట్రేడ్ అయ్యాయి. షార్క్ రకాలు రూ.80-110, సీజెంటా భెడిగి రూ.80-110, నం:5 రకం రూ.90-125 ధరలు పలికాయి. డి.డి రకం రూ.80-115, 273 రకం రూ.90-120, ఆర్ముర్ రకం రూ.75గా విక్రయించబడ్డాయి.