News June 30, 2024

HYD: వెంకయ్య నాయుడు జీవన యాత్ర పై పుస్తకావిష్కరణ

image

HYDలోని రాజ్ భవన్ వద్ద మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు లైఫ్ జర్నీపై ప్రధాని మోదీ వర్చువల్ పద్ధతిలో పుస్తకాన్ని ఆవిష్కరించారు. రాజ్ భవన్ వద్ద ఈ కార్యక్రమం జరగగా.. ముఖ్య అతిథిగా వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం మాజీ ఉపరాష్ట్రపతికి ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Similar News

News October 10, 2024

HYD: దసరా స్పెషల్.. ఆయుధాలకు పూజలు

image

రాచకొండ సీపీ సుధీర్ బాబు ఐపీఎస్ దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నేడు అంబర్‌పేట పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ఆయుధ పూజ, వాహన పూజ చేశారు. ఈ కార్యక్రమంలో పోలీసు వాహనాలు, తుపాకులకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాచకొండ అడ్మిన్ డీసీపీ ఇందిర, అడిషనల్ డీసీపీ శ్యాంసుందర్, ఏసీపీ, ఇతర సిబ్బంది సైతం పాల్గొన్నారు.

News October 10, 2024

HYD: ESI కాలేజీలో పారామెడికల్ కోర్సులు

image

హైదరాబాద్ సనత్‌నగర్ ESI మెడికల్ కాలేజీలో పారా మెడికల్, బీఎస్సీ నర్సింగ్ కోర్సులు ప్రారంభానికి అనుమతి లభించింది. కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ఆధ్వర్యంలో 194వ ESI సమావేశంలో ఆమోదం ముద్ర వేశారు. మెడికల్ కాలేజీ ఈ కోర్సులు ప్రారంభానికి అనుమతి లభించటంతో విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News October 10, 2024

HYD: హైడ్రా పవర్స్.. పూర్తి వివరాలు!

image

TG ప్రభుత్వం జులై 17న హైడ్రా ఏర్పాటు చేస్తూ GO 59 జారీ చేసింది. గ్రేటర్‌తో పాటు 8 మున్సిపల్ కార్పొరేషన్లు, 20 మున్సిపాలిటీలు, 38 పంచాయతీలు, 61 పారిశ్రామికవాడలు, సికింద్రాబాద్ కంటోన్మెంట్‌ను హైడ్రాకు అప్పగించింది. GHMC, స్థానిక సంస్థల పరిధి పార్కులు, లే అవుట్లు, ఖాళీ స్థలాలు, పరిశ్రమల శాఖ స్థలాలు, జలవనరుల స్థలాలు పరిరక్షించడమే దీని బాధ్యత. తాజాగా 51 విలీన గ్రామాలు హైడ్రా పరిధిలోకి వచ్చాయి.