News July 1, 2024
ప్రభుత్వ మద్యంలో ‘కిక్’ లేదు.. అందుకే: తమిళనాడు మంత్రి

తమిళనాడులో కల్తీ సారా తాగి ఇటీవల 65 మంది చనిపోయిన ఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా మంత్రి దురైమురుగన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ‘కష్టపడి పని చేసేవారికి ఉపశమనం కోసం మద్యం అవసరం. అటువంటి వారికి అది శీతలపానీయం లాంటిది. అయితే ప్రభుత్వం విక్రయించే మద్యంలో వారికి కిక్ లభించకపోవడంతో కొందరు నాటుసారాను ఆశ్రయిస్తున్నారు’ అని పేర్కొన్నారు.
Similar News
News January 12, 2026
‘రాజాసాబ్’ మూడు రోజుల కలెక్షన్స్ ఎంతంటే?

‘రాజాసాబ్’ సినిమాకు 3 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.161కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు Sacnilk వెబ్‌సైట్ పేర్కొంది. ఇండియాలో రూ.129.20కోట్లు, ఓవర్సీస్‌లో రూ.31.80 కోట్లు రాబట్టినట్లు తెలిపింది. మూడో రోజు ఇండియాలో రూ.22.6 కోట్లు కలెక్ట్ చేసినట్లు వెల్లడించింది. కాగా నార్త్ అమెరికా గ్రాస్ కలెక్షన్స్ $2.2M (రూ.19.83కోట్లు) దాటినట్లు మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది.
News January 12, 2026
బంగ్లాదేశ్ WC మ్యాచులు భారత్‌లోనే!

టీ20 వరల్డ్ కప్‌లో తమ మ్యాచులను భారత్ నుంచి శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే దీనిపై ICC ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వాటిని శ్రీలంకకు మార్చకపోవచ్చు. షెడ్యూల్ ప్రకారం బంగ్లా టీమ్ కోల్‌కతా, ముంబైలో 4 మ్యాచులు ఆడాల్సి ఉంది. వాటిని విదేశాల్లో నిర్వహించకపోవచ్చని సమాచారం. అక్కడ జరగాల్సిన మ్యాచులను చెన్నై, తిరువునంతపురంలో నిర్వహిస్తారని తెలుస్తోంది.
News January 12, 2026
నల్లమల సాగర్‌తో ఎవరికీ నష్టం లేదు: చంద్రబాబు

AP: నల్లమలసాగర్ ద్వారా రాయలసీమ, ప్రకాశం తదితర ప్రాంతాలకు నీరిచ్చే అవకాశం ఉందని మంత్రులు, అధికారుల మీటింగ్‌లో CM CBN తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఎవరికీ నష్టం లేదన్నారు. ఎగువ నుంచి వదిలిన నీళ్లు పోలవరం ద్వారా నల్లమల సాగర్‌కు తీసుకెళ్లి వాడుకుంటే తప్పేంటని ప్రశ్నించారు. దీనివల్ల సాగర్, శ్రీశైలంలో మిగులుజలాలను AP, TG వాడుకోవచ్చని వ్యాఖ్యానించారు. అందరం కలిసి పనిచేసుకుందామని TGకి కూడా చెప్పానన్నారు.


