News July 1, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

తేది: జులై 01, సోమవారం
ఫజర్: తెల్లవారుజామున 4:24 గంటలకు సూర్యోదయం: ఉదయం 5:46 గంటలకు జొహర్: మధ్యాహ్నం 12:20 గంటలకు అసర్: సాయంత్రం 4:57 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6:55 గంటలకు
ఇష: రాత్రి 8.16 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

Similar News

News January 13, 2026

ఇండియాలో ఆడబోం.. ICCకి స్పష్టం చేసిన బంగ్లా

image

టీ20 వరల్డ్‌కప్ మ్యాచులను ఇండియాలో <<18761652>>ఆడబోమని<<>> బంగ్లాదేశ్ మరోసారి స్పష్టం చేసింది. తమ ప్లేయర్ల భద్రత దృష్ట్యా వేరే దేశంలో మ్యాచులు నిర్వహించాలని కోరింది. ఇవాళ ICCతో బంగ్లా బోర్డు వర్చువల్‌గా సమావేశమైంది. టోర్నమెంట్ షెడ్యూలు, ప్రయాణ ప్లాన్ ఇప్పటికే ఖరారైందని, దీనిపై పునరాలోచించాలని ICC కోరింది. కానీ BCB ఒప్పుకోలేదు. దీంతో ఏకాభిప్రాయం కోసం చర్చలను కొనసాగించాలని బోర్డులు అంగీకరించాయి.

News January 13, 2026

సంక్రాంతి రోజున అస్సలు చేయకూడని పనులివే..

image

సంక్రాంతి పర్వదినాన స్నానం చేసాకే ఆహారం తీసుకోవాలి. ప్రకృతిని ఆరాధించే పండుగ కాబట్టి చెట్లు, మొక్కలను నరకకూడదు. మద్యం, మాంసాహారం, ఉల్లి, వెల్లుల్లి వంటి తామసిక ఆహారాలు తీసుకోకూడదు. ఇంటికి వచ్చిన సాధువులు, పేదలను ఖాళీ చేతులతో పంపకూడదు. ఎవరితోనూ కఠినంగా మాట్లాడకూడదు. అప్పులు ఇవ్వడం, తీసుకోవడం మంచిది కాదు. సాయంత్రం వేళ నిద్రించకూడదని పండితులు చెబుతారు. ఈ నియమాలు పాటిస్తే శుభం కలుగుతుందని నమ్మకం.

News January 13, 2026

భారీగా బీర్ల ఉత్పత్తి.. కంపెనీలకు ప్రభుత్వ నిర్దేశం

image

TG: వేసవిలో బీర్లకు డిమాండ్ అధికంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో వాటి ఉత్పత్తిని భారీగా పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత వేసవిలో రోజుకు2.30 లక్షల కేసుల బీర్లు అమ్ముడయ్యాయి. ఈసారి అది 2.50 లక్షల కేసులకు పెరగొచ్చని అంచనా వేస్తోంది. ఈమేరకు అన్ని బ్రూవరీలకు లక్ష్యాలను నిర్దేశించింది. కాగా ఎక్సైజ్ కార్యదర్శి రఘునందన్ రావు, కమిషనర్ హరి కిరణ్ బ్రూవరీలను సందర్శించి బీర్, ఇతర మద్యం ఉత్పత్తిపై సూచనలు ఇచ్చారు.