News July 1, 2024

ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియం భారత్‌లో ఏర్పాటు: కేంద్రమంత్రి

image

ప్రపంచంలో అతిపెద్ద మ్యూజియంను వచ్చే ఏడాది భారత్‌లో ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. ఇది ఫ్రాన్స్‌లోని లౌవ్రె మ్యూజియం కన్నా రెండింతలు పెద్దగా ఉంటుందని చెప్పారు. ఇదే విషయమై ఫ్రాన్స్‌తో ఒప్పందం జరిగిందని జోధ్‌పుర్‌లో మీడియాతో పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియాన్ని ఏర్పాటు చేసే ప్రాజెక్టులో పాలుపంచుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు.

Similar News

News February 25, 2026

T20 WC: పాక్ సెమీస్ చేరాలంటే..

image

T20 WCలో ఇంగ్లాండ్‌ చేతిలో ఓడిపోయిన పాక్‌కు సెమీస్ చేరడానికి రెండు అవకాశాలు ఉన్నాయి. మొదటిది శ్రీలంకపై పాక్ కచ్చితంగా గెలవాలి. అదే సమయంలో న్యూజిలాండ్‌ను శ్రీలంక, ఇంగ్లాండ్ ఓడించాలి. అప్పుడు పాక్ మూడు పాయింట్లతో సెమీస్ చేరుతుంది. ఇక రెండోది న్యూజిలాండ్ తన మిగిలిన రెండు మ్యాచ్‌లలో ఒక్కటే గెలిస్తే శ్రీలంకపై పాక్ భారీ తేడాతో గెలిచి కివీస్ కంటే మెరుగైన నెట్ రన్ రేట్ సాధించాలి.

News February 25, 2026

రష్యా-ఉక్రెయిన్ ‘కాల్పుల విరమణ’పై ఓటింగ్‌కు భారత్ దూరం

image

రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి నాలుగేళ్లు పూర్తైన వేళ కాల్పుల విరమణ తీర్మానాన్ని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ప్రవేశపెట్టారు. దీనిపై ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉంది. ఉక్రెయిన్ ప్రతిపాదించిన ఈ తీర్మానానికి 107 దేశాలు మద్దతు తెలపగా, భారత్, చైనా సహా 51 దేశాలు ఓటింగ్‌లో పాల్గొనలేదు. అంతర్జాతీయ చట్టాలకు లోబడి శాంతిని నెలకొల్పాలని, యుద్ధ ఖైదీలను విడుదల చేయాలని ఈ తీర్మానం కోరింది.

News February 25, 2026

విజయ్-రష్మిక పెళ్లి.. ఇండస్ట్రీ గెస్ట్ లిస్ట్ ఇదే

image

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహ వేడుకలు ఉదయ్‌పూర్‌లో ఘనంగా ప్రారంభమయ్యాయి. కేవలం సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్యే ఈ వేడుక జరుగుతున్నప్పటికీ.. ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు. వీరిలో తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా, శ్రావ్య వర్మ, ఆషికా రంగనాథ్, రాహుల్ రవీంద్రన్ వంటివాళ్లు ఉన్నారు. రేపు జరగనున్న ఈ పెళ్లికి మొత్తంగా 100 మంది మాత్రమే హాజరవుతున్నట్లు సమాచారం.