News July 1, 2024
పాతపట్నం మాజీ ఎమ్మెల్యే కుమార్తెకు ఉత్తమ కలెక్టర్ అవార్డు

పాతపట్నం మాజీ MLA రెడ్డి శాంతి కుమార్తె రెడ్డి వేదిత (ఐఎఎస్) ఆదివారం ఉత్తమ కలెక్టర్ అవార్డును అందుకున్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా నివారణ పట్ల కార్యాచరణ ప్రణాళిక రూపొందించి పక్కాగా అమలు చేశారు. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (నేషనల్ కమిషనర్ ఫర్ ప్రొటెక్షన్ అఫ్ చైల్డ్ రైట్స్) సూచీల ఆధారంగా ఈ అవార్డును అందజేశారు.
Similar News
News September 16, 2025
శ్రీకాకుళం జిల్లాలో టుడే టాప్ న్యూస్ ఇవే..!

➤పలాస: సమస్యల పరిష్కారానికి రోడ్డెక్కిన ఉపాధ్యాయులు.
➤మందస: బలవంతపు భూ సేకరణ ఆపాలి
➤సీఎం సమీక్ష సమావేశంలో సిక్కోలు మంత్రి, కలెక్టర్
➤టెక్కలి: మెరుగైన సేవలకు మరో భవనం కట్టాల్సిందే
➤బూర్జ: పాఠశాలకు తాళం వేసి విద్యార్థులు, తల్లిదండ్రులు నిరసన
➤ఎల్.ఎన్ పేట: నిలిచిన నిర్మాణం.. రాకపోకలకు అంతరాయం
➤రాజమండ్రిలో రైలెక్కిన బాలుడిని పలాసలో రక్షించిన పోలీసులు
News September 15, 2025
శ్రీకాకుళం-విశాఖకు ఈ రైళ్లు నడవనున్నాయి

శ్రీకాకుళం జిల్లా వాసులకు రైల్వే శాఖ శుభవార్త తెలిపింది. విశాఖ-బ్రహ్మపూర్-విశాఖపట్నం(18525/26) రైలును ఇటీవల రద్దు చేసిన విషయం తెలిసిందే. మరలా సేవలను పునరుద్ధరించినట్లు తాజాగా వెల్లడించింది. పలాస-విశాఖ(67290) మెము రైలును విశాఖ వరకు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఇవి శ్రీకాకుళం రోడ్డు, పొందూరు, నౌపడ, పలాస, సోంపేట, ఇచ్ఛాపురం తదితర స్టేషన్లు మీదుగా నడవనున్నాయి.
News September 15, 2025
సీఎం సమీక్ష సమావేశంలో సిక్కోల్ మంత్రి, కలెక్టర్

సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం రాష్ట్ర రాజధాని సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో మంత్రి అచ్చెన్నాయుడు, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పాల్గొన్నారు. అభివృద్ధి పదం వైపు నడుస్తున్న రాష్ట్రాన్ని, జిల్లాలను అధికారులు సమన్వయంతో పనిచేసే మరింత అభివృద్ధి చెందేలా కృషి చేయాలని అధికారులను ఆదేశించారు.