News July 1, 2024

నేటి నుంచి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం పోరాటం

image

సింగరేణిని కాపాడుకునేందుకు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం పోరాటానికి సిద్ధమైంది. సోమవారం నుంచి సింగరేణి వ్యాప్తంగా దశలవారీగా ఆందోళన కార్య క్రమాలు నిర్వహిస్తున్నట్లు టీబీజీకేఎస్ అధ్యక్షుడు రాజిరెడ్డి స్పష్టం చేశారు. 1న గనులపై నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేయడంతో పాటు గని అధికారులకు వినతిపత్రాలు అందజేస్తామని తెలిపారు.

Similar News

News July 5, 2024

KNR: నిరుపయోగంగా మారుతున్న రైతువేదికలు

image

రైతులకు ఆధునిక ,సాంకేతిక సమాచారాన్ని అందించేందుకు ఒక వేదికను నిర్మించాలని గత ప్రభుత్వం రైతు వేదికలకు శ్రీకారం చుట్టింది. ఆరేళ్ల క్రితం అట్టహాసంగా రైతువేదికల నిర్మాణం చేపట్టగా అసంపూర్తి పనులు చేపట్టి చేతులు దులుపుకున్నారు. కరీంనగర్ మండలంలో దుర్శేడు, బొమ్మకల్, నగునూర్, చామనపల్లిలో నిర్మించిన రైతువేదిక భవనాల్లో సౌకర్యాలు లేక, అసంపూర్తిగా నిర్మాణాలు చేయగా, ఇవి నిరుపయోగంగా మారుతున్నాయి.

News July 5, 2024

కరీంనగర్: జలపాతం వద్ద తేనెటీగల దాడి.. ఇద్దరికి గాయాలు

image

కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం రాయికల్ జలపాతాన్ని సందర్శించేందుకు వెళ్లిన ఇద్దరు యువకులకు గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. కరీంనగర్‌కు చెందిన సంపత్, మన్నెంపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్ గురువారం జలపాతాన్ని చూసేందుకు వెళ్లగా.. తేనెటీగలు దాడి చేశాయన్నారు. ఈ ఘటనలో ఇద్దరు యువకులు స్పృహ తప్పి పడిపోయారు. వారికి గాయాలు కావడంతో గ్రామస్థులు 108 ద్వారా హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

News July 5, 2024

జమ్మికుంట: భర్త వేధింపులతో భార్య ఆత్మహత్య

image

జమ్మికుంట పట్టణంలోని మారుతి నగర్‌కు చెందిన జీడి కావ్య (28) ఆత్మహత్య చేసుకున్నట్లు CI రవి తెలిపారు. CI వివరాలు.. వీణవంక మండలం ఎల్బాక గ్రామానికి చెందిన జీడి రాజుతో 12 ఏళ్ల క్రితం కావ్య వివాహం జరిగింది. కొన్ని రోజులుగా భార్య కావ్యను అనుమానంతో భర్త రాజు వేధించాడు. దీంతో బుధవారం రాత్రి ఇంట్లో కావ్య ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కావ్య తల్లి ఫిర్యాదు మేరకు రాజుపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.