News July 1, 2024

విశాఖ నగరానికి తలమానికంగా క్లాక్ టవర్

image

విశాఖ మహా నగరానికి జగదాంబ జంక్షన్‌లో ఏర్పాటు చేసిన క్లాక్ టవర్ తలమానికంగా నిలిచింది. నగరాభివృద్ధిలో భాగంగా అధికారులు సుందరీకరణ పనులు చేపట్టారు. ఈ నేపథ్యంలో నగరంలోని అతి ముఖ్యమైన జగదాంబ సెంటర్‌లో క్లాక్ టవర్‌ను నూతనంగా నిర్మించారు. ఈ టవర్ చుట్టూ విద్యుత్ దీపాలను అందంగా అలంకరించారు. ఈ క్లాక్ టవర్ పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది.

Similar News

News July 5, 2024

విశాఖలో సందర్శనకు ‘కల్కి’ బుజ్జి

image

కల్కి సినిమాలో హీరో ప్రభాస్ ఉపయోగించిన బుజ్జి వాహనాన్ని విశాఖలో సందర్శకులకు అందుబాటులో ఉంచారు. శుక్రవారం విశాఖ వ్యాలీ స్కూల్ ప్రాంగణంలో దీన్ని ఉంచారు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ వాహనం వద్ద నిలుచుని ఫొటోలు తీసుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. కల్కి సినిమాలో ఉపయోగించడం కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఈ వాహనాన్ని దేశంలోని పలు ప్రాంతాల్లో నిర్వాహకులు సందర్శనకు వీలుగా ఉంచుతున్నారు.

News July 5, 2024

విశాఖ: సచివాలయ సేవల్లో జాప్యం..?

image

గ్రామ సచివాలయానికి సంబంధించిన సేవల్లో గత వారం రోజులుగా జాప్యం జరుగుతోందని లబ్ధిదారులు అంటున్నారు. సర్వర్ పనిచేయడం లేదంటూ వివిధ సర్టిఫికెట్ల జారీ, దరఖాస్తులు చేసుకునే ప్రక్రియలు సిబ్బంది నిలిపి వేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యార్థులు వివిధ సర్టిఫికెట్ల కోసం సచివాలయాలు చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నారు. అదే సమయంలో భూములకు సంబంధించిన మ్యుటేషన్ సంబంధించిన పనులు కూడా జరగడం లేదని సమాచారం.

News July 5, 2024

విశాఖ: డీసీఐకి రూ.156.5 కోట్లతో ఒప్పందం

image

ప్రతిష్ఠాత్మకమైన కొచ్చిన్ పోర్టు అథారిటీ‌తో రూ. 156.50 కోట్ల విలువైన డ్రెడ్జింగ్ ఒప్పందం కుదిరినట్లు డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (డీసీఐ) ఛైర్మెన్ అంగముత్తు తెలిపారు. డ్రెడ్జింగ్ పరిశ్రమల్లో డీసీఐ అగ్రగామిగా ఉందన్నారు. భారీస్థాయి డ్రెడ్జింగ్ ప్రాజెక్టులను అమలు చేయడంలో మంచి రికార్డు ఉందని వెల్లడించారు. ఈ ఒప్పందం డీసీఐ ప్రతిష్ఠను మరింత పెంచుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.