News July 1, 2024

ప్రభుత్వ బంగ్లాలు ఖాళీ చేయాలని ఓడిన ఎంపీలకు కేంద్రం ఆదేశం

image

సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన ఎంపీలు ఢిల్లీలోని అధికారిక నివాసాలను ఈ నెల 11లోపు ఖాళీ చేయాలని కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు డైరెక్టరేట్ ఆఫ్ ఎస్టేట్స్ నోటీసులిచ్చింది. విజయం సాధించిన సిట్టింగ్ ఎంపీలు గతంలో కేటాయించిన నివాసాల్లో అలాగే కొనసాగుతారు. బంగ్లాలను ఖాళీ చేయాల్సిన వారిలో స్మృతీ ఇరానీ, ఆర్కే సింగ్, అర్జున్ ముండా, రాజీవ్ చంద్రశేఖర్, మురళీధరన్, భారతీ పవార్ తదితర ప్రముఖులు కూడా ఉన్నారు.

Similar News

News July 5, 2024

రక్షణ ఉత్పత్తుల్లో రికార్డు

image

2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్‌లో రూ.1.27 లక్షల కోట్ల విలువైన రక్షణ ఉత్పత్తులు జరిగినట్లు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ట్వీట్ చేశారు. 2022-23తో పోలిస్తే ఏకంగా 16.8% పెరిగినట్లు పేర్కొన్నారు. ఆత్మనిర్భరత లక్ష్యాన్ని చేరుకోవడంలో PM ఆధ్వర్యంలో ప్రభుత్వ విధానాలు విజయవంతంగా అమలవుతున్నాయన్నారు. ఈ ఘనత సాధించినందుకు రక్షణ శాఖకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు.

News July 5, 2024

భోలే బాబాకు రూ.100 కోట్ల ఆస్తులు?

image

హాథ్రస్ తొక్కిసలాటలో 121 మంది మృతికి కారణమైన భోలే బాబా గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భోలేకు ఏకంగా రూ.100 కోట్ల ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే దేశవ్యాప్తంగా 24 ఆశ్రమాలు ఉన్నట్లు సమాచారం. ఆయనకు 16 మంది బాడీగార్డులు, 15 నుంచి 30 ఎస్కార్ట్ వాహనాలు ఉంటాయి. ప్రస్తుతం ఆయన నివసిస్తున్న మెయిన్‌పురి ఆశ్రమం 13 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఆయన భార్య కోసం 6 లగ్జరీ రూమ్స్ కూడా ఉన్నాయట.

News July 5, 2024

పవన్ సినిమాపై రూమర్స్.. డైరెక్టర్ స్ట్రాంగ్ రిప్లై!

image

పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా ఆగిపోనున్నట్లు పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీనిపై డైరెక్టర్ హరీశ్ శంకర్ ఘాటుగా స్పందించారు. ‘సినిమా స్టార్ట్ అవ్వదు అన్నప్పుడే రూమర్స్ పట్టించుకోలేదు. ఇప్పుడు రూమర్స్ చదివే టైమ్ కూడా లేదు’ అని ఓ నెటిజన్‌కు Xలో రిప్లై ఇచ్చారు. ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా, దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.