News July 1, 2024

పార్టీ మార్పు వార్తలు అవాస్తవం: సబితా ఇంద్రారెడ్డి

image

TG: తాను పార్టీ మారుతున్నాననే వార్తలు పూర్తిగా అవాస్తవమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు Xలో పేర్కొన్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. తనకు KCR సముచిత స్థానం కల్పించారని, పార్టీ మారాల్సిన అవసరం లేదన్నారు. బీఆర్ఎస్‌లోనే కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తానని స్పష్టం చేశారు.

Similar News

News January 30, 2026

ఉగాదికి జాబ్ క్యాలెండర్!

image

AP: ఈ ఉగాదికి జాబ్ క్యాలెండర్ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. శాఖల వారీగా ఖాళీలను సేకరిస్తున్నట్లు సమాచారం. పకడ్బందీగా జాబ్ క్యాలెండర్ నిర్వహణకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు కూటమి వర్గాలు చెబుతున్నాయి. ఆర్థిక శాఖపై పడే భారం బేరీజు వేసుకొని ఏటా జాబ్ క్యాలెండర్ ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు పేర్కొంటున్నాయి. వీలైనంత త్వరగా ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నట్లు తెలిపాయి.

News January 30, 2026

దానంపై అనర్హత పిటిషన్లు.. విచారణ ప్రారంభం

image

TG: ఖైరతాబాద్ MLA దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని కోరుతూ కౌశిక్‌రెడ్డి వేసిన పిటిషన్‌పై స్పీకర్ విచారణ ప్రారంభించారు. ఇదే విషయంపై మహేశ్వర్‌రెడ్డి వేసిన పిటిషన్‌ను ఇవాళ 12pmకు విచారిస్తారు. విచారణ నిమిత్తం అసెంబ్లీకి దానం చేరుకున్నారు. అంతకుముందు అడ్వకేట్లతో చర్చించారు. కౌశిక్‌, మహేశ్వర్‌ను నాగేందర్‌ లాయర్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. తాను BRSలోనే ఉన్నానని దానం ఇప్పటికే కౌంటర్ వేశారు.

News January 30, 2026

22,000 జాబ్స్.. రేపటి నుంచే అప్లికేషన్లు

image

RRB నోటిఫికేషన్ జారీ చేసిన 22వేల గ్రూప్-డి ఉద్యోగాలకు రేపటి నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది. మార్చి 2 వరకు అవకాశం ఉంటుంది. పాయింట్స్‌మెన్, అసిస్టెంట్, ట్రాక్ మెయింటెయినర్, అసిస్టెంట్ లోకో షెడ్, అసిస్టెంట్ ఆపరేషన్స్ తదితర ఖాళీలకు పదో తరగతి, ఐటీఐ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. వయసు 1-1-2026 నాటికి 18 నుంచి 33 మధ్య ఉండాలి. స్టార్టింగ్ శాలరీ నెలకు రూ.18వేలు.
వెబ్‌సైట్: <>rrbsiliguri.gov.in<<>>