News July 1, 2024
రాష్ట్రపతి ప్రసంగంపై నేడు ధన్యవాద తీర్మానం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1719802062265-normal-WIFI.webp)
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని కేంద్ర మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఇవాళ పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. దీనిపై చర్చకు లోక్‌సభలో కేంద్రం 16 గంటల సమయాన్ని కేటాయించింది. మరోవైపు ఇదే సమయంలో నీట్ పేపర్ లీకేజీ, నిరుద్యోగం, అగ్నిపథ్, ద్రవ్యోల్బణం వంటి అంశాలను ప్రతిపక్షాలు లేవనెత్తనున్నట్లు తెలుస్తోంది.
Similar News
News February 11, 2025
ఏఐ టెక్నాలజీ అందరికీ అందుబాటులోకి రావాలి: పీఎం మోదీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739271170554_1045-normal-WIFI.webp)
ఏఐ టెక్నాలజీ అన్ని దేశాలకూ అందుబాటులోకి రావాలని పారిస్‌లో జరిగిన ఏఐ శిఖరాగ్ర సదస్సులో PM మోదీ అన్నారు. ‘ఏఐ అనేది ఇప్పటికే మన రాజకీయ, ఆర్థిక, భద్రత, సామాజిక వ్యవస్థల్ని సమూలంగా మార్చేస్తోంది. ఈ శతాబ్దంలో మానవాళికి ఏఐ కోడ్ వంటిది. శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. అంతే వేగంగా ప్రజలకు అందుబాటులోకి వస్తోంది. ఏఐలో మా అనుభవాన్ని ప్రపంచంతో పంచుకోవడానికి మేం ఎల్లప్పుడూ సిద్ధం’ అని పేర్కొన్నారు.
News February 11, 2025
పదో తరగతి అర్హతతో 21,413 ఉద్యోగాలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739268386153_653-normal-WIFI.webp)
ఇండియన్ పోస్ట్ 21,413 GDS పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏపీలో 1215, తెలంగాణలో 519 ఖాళీలున్నాయి. అర్హత 10వ తరగతి కాగా కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరి. సైకిల్ లేదా స్కూటర్ నడిపే నైపుణ్యం ఉండాలి. వయసు 18-40 ఏళ్ల మధ్య ఉండాలి. మెరిట్ ఆధారంగా రిక్రూట్‌మెంట్ చేపడతారు. దరఖాస్తు ఫీజు జనరల్, ఓబీసీ, EWS వారికి రూ.100 కాగా మిగతా అభ్యర్థులకు ఉచితం. మార్చి 3 వరకు <
News February 11, 2025
పేరెంట్స్ శృంగారంపై కామెంట్స్.. వీడియో తొలగించిన యూట్యూబ్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739271499918_695-normal-WIFI.webp)
‘ఇండియాస్ గాట్ లేటెంట్’లో పేరెంట్స్ శృంగారంపై యూట్యూబర్ రణ్‌వీర్ అలహాబాదియ చేసిన <<15413969>>అభ్యంతకర వ్యాఖ్యలు<<>> దుమారం రేపుతున్నాయి. పార్లమెంటులోనూ ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. ఈ క్రమంలో మొత్తం ఎపిసోడ్ వీడియోను యూట్యూబ్ తొలగించింది. సమాచార మంత్రిత్వ శాఖ, NHRC ప్రతినిధుల ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. తన వ్యాఖ్యలపై రణ్‌వీర్ క్షమాపణ కోరిన విషయం తెలిసిందే.