News July 1, 2024

మద్యం నిల్వ కేసు.. వైసీపీ MLA అభ్యర్థిని తండ్రి అరెస్ట్

image

మద్యం నిల్వ చేసిన కేసులో మంగళగిరి YCP అభ్యర్థినిగా పోటీ చేసిన మురుగుడు లావణ్య తండ్రి, వైసీపీ నాయకుడు కాండ్రు శివనాగేంద్రంను అరెస్టు చేసినట్లు సెబ్ సీఐ ప్రసన్న ఆదివారం తెలిపారు. మంగళగిరిలోని కాండ్రు వారి వీధిలో దామర్ల వీరాంజనేయులు నివాసంలో జూన్ 1న 6,528 మద్యం సీసాలను నిల్వ చేశారు. దీంతో పోలీసులు శివనాగేంద్రంను శనివారం అరెస్టు చేసి మంగళగిరి కోర్టులో హాజరుపరచగా 15 రోజుల రిమాండ్ విధించింది.

Similar News

News July 5, 2024

రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్.. ఐదుగురికి ప్రాణదానం

image

రోడ్డు ప్రమాదంలో గాయపడి బ్రెయిన్ డెడ్‌ అయిన వ్యక్తి అవయవాలను దానం చేసేందుకు కుటుంబీకులు ముందుకొచ్చారు. మంగళగిరికి చెందిన న్యాయవాది ప్రసాద్‌కు 2రోజుల క్రితం రోడ్డు ప్రమాదం జరగగా NRI ఆసుపత్రికి తరలించారు. కాగా వైద్యులు ప్రసాద్‌కు బ్రెయిన్ డెడ్‌గా నిర్థారించారు. అతని అవయువాలను శుక్రవారం మధ్యాహ్నం NRI నుంచి గ్రీన్ ఛానల్ ద్వారా గుండెను తిరుపతికి తరలించనున్నారు.

News July 5, 2024

గుంటూరు: అప్పుల బాధ తాళలేక కౌలు రైతు ఆత్మహత్య

image

వట్టిచెరుకూరు మండలం కొర్నెపాడుకి చెందిన కౌలు రైతు రాణాప్రతాప్ (34) అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. SI వినోద్ బాబు తెలిపిన వివరాల ప్రకారం.. 3 సంవత్సరాలుగా మృతుడు మిర్చి సాగు చేస్తున్నాడని, పంటలపై రూ.4లక్షలు అప్పు తీసుకున్నాడు. అప్పు తీర్చే మార్గం లేక ప్రతాప్ జూన్ 29న పురుగు మందు తాగాడన్నారు. బంధువులు గుంటూరు GGHకు తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఘటనపై కేసు పోలీసులు నమోదు చేశారు.

News July 5, 2024

గుంటూరు: అప్పుల బాధ తాళలేక కౌలు రైతు ఆత్మహత్య

image

వట్టిచెరుకూరు మండలం కొర్నెపాడుకి చెందిన కౌలు రైతు రాణాప్రతాప్ (34) అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. SI వినోద్ బాబు తెలిపిన వివరాల ప్రకారం.. 3 సంవత్సరాలుగా మృతుడు మిర్చి సాగు చేస్తున్నాడని, పంటలపై రూ.4లక్షలు అప్పు తీసుకున్నాడన్నారు. అప్పు తీర్చే మార్గం లేక ప్రతాప్ జూన్ 29న గడ్డి మందు తాగడన్నారు. బంధువులు గుంటూరు GGHకు తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఘటనపై కేసు పోలీసులు నమోదు చేశారు.