News July 1, 2024

NLR: నేటి నుంచి బాదుడే బాదుడు

image

దేశ వ్యాప్తంగా జాతీయ రహదారిపై టోల్ ప్లాజాల వద్ద సోమవారం నుంచి పెంచిన రుసుము వసూళ్లు చేస్తారు. నెల్లూరు జిల్లా పరిధిలో వెంకటాచలం, కావలి, బూదనం టోల్ గేట్లు ఉన్నాయి. ఇప్పుడు ఆయా ప్రాంతాల్లో వాహనాల నుంచి అదనంగా రూ.15 వరకు వసూళ్లు చేస్తారు. ఈ మేరకు వాహనదారులు తమ ఫాస్టాగ్‌లో నగదు నిల్వలు సరిచూసుకోవాలని టోల్ గేట్ల నిర్వాహకులు చూస్తున్నారు.

Similar News

News July 5, 2024

దేవదాయ శాఖ మంత్రితో పొంగూరు నారాయణ భేటీ

image

రాష్ట్ర దేవ‌దాయ ధ‌ర్మ‌దాయ శాఖామంత్రి ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డితో మంత్రి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా నెల్లూరు న‌గ‌రం సంత‌పేట‌లోని ఆనం నివాసంలో మంత్రిని పొంగూరు నారాయ‌ణ మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు. మంత్రి ఆనంకు నారాయ‌ణ పుష్ప‌గుచ్ఛం అంద‌చేసి శాలువాతో స‌త్క‌రించారు. ప్రస్తుత తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించుకున్నట్లు సమాచారం.

News July 5, 2024

NLR: ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తులు

image

జాతీయ ఉపాధ్యాయ అవార్డులకు.. అర్హులైన ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు నెల్లూరు డీఈఓ రామారావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. nationalawards toteachers. education. gov. in వెబ్‌సైట్‌లో ఈ నెల 15వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. అర్హతలు, ఇతర వివరాల కోసం వెబ్‌సైట్‌ను సంప్రదించాలని డీఈవో సూచించారు.

News July 5, 2024

అనంతసాగరం: పాము కాటుతో కౌలు రైతు మృతి

image

అనంతసాగరం మండలం, చిలకలమర్రి గ్రామానికి చెందిన డబ్బుకుంట శీనయ్య అనే కౌలు రైతు పాముకాటుతో మృతి చెందినట్లు ఎస్సై సుబ్బారావు తెలిపారు. బుధవారం రాత్రి నీళ్లు వదిలేందుకు పొలానికి వెళ్ళగా పాము కాటు వేసింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆత్మకూరు వైద్యశాలకు తీసుకువెళ్లారు. మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.