News July 1, 2024
BIG BREAKING: తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు

చమురు సంస్థలు వంట గ్యాస్ వినియోగదారులకు శుభవార్త చెప్పాయి. 19కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్‌పై రూ.31 తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. తగ్గిన ధరలు ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చాయి. తాజా తగ్గింపుతో ఢిల్లీలో గ్యాస్ సిలిండర్ ధర రూ.1646కు చేరింది. ఇదే సమయంలో 14.2 కేజీల సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు చేయలేదు.
Similar News
News April 13, 2026
రాష్ట్రపతితో మంత్రి లోకేశ్ భేటీ

AP: కూటమి ఎంపీలతో కలిసి ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో మంత్రి లోకేశ్ సమావేశమయ్యారు. అమరావతి బిల్లుకు ఆమోదం తెలిపినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా అమరావతి చారిత్రక, సాంస్కృతిక ప్రాధాన్యాన్ని ప్రెసిడెంట్‌కు లోకేశ్ వివరించారు. అటు ఢిల్లీలో ఈనెల 30 నుంచి మే 10 వరకు శ్రీవేంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో జరిగే బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించాలని టీటీడీ అధికారులకు మంత్రి సూచించారు.
News April 13, 2026
మోనాలిసా కేసు.. భర్తకు హైకోర్టులో ఊరట

కుంభమేళా బ్యూటీ మోనాలిసా కేసులో ట్విస్టులు కొనసాగుతున్నాయి. మైనరైన ఆమెను కిడ్నాప్ చేశారంటూ నమోదైన కేసులో భర్త ఫర్మాన్ ఖాన్‌కు కేరళ హైకోర్టు ఊరటనిచ్చింది. మే 20 వరకు అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ ఉత్తర్వులిచ్చింది. కాగా మోనాలిసా మైనర్ అని NCST నిర్ధారించడంతో భర్తపై పోక్సో కేసు నమోదైన విషయం తెలిసిందే. మరోవైపు కొన్ని రోజులుగా మోనాలిసా కనిపించట్లేదని భర్త నిన్న <<19631395>>సెల్ఫీ వీడియో<<>> రిలీజ్ చేశారు.
News April 13, 2026
పోలింగ్ కేంద్రాల్లో బయోమెట్రిక్స్.. ఈసీ, కేంద్రానికి SC నోటీసులు

ఎన్నికల నిర్వహణపై ఈసీ, కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. దొంగ ఓట్లను అరికట్టేందుకు పోలింగ్ కేంద్రాల్లో బయోమెట్రిక్ పెట్టాలంటూ BJP నేత అశ్విని కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా నోటీసులు ఇచ్చింది. అమలుపై తమ అభిప్రాయం చెప్పాలని ఆదేశించింది. అయితే ఇప్పటికిప్పుడు ఈ విధానాన్ని అమలు చేయడం సాధ్యం కాకపోవచ్చని, భవిష్యత్తులో అమలుకు వ్యవస్థలన్నీ కలిసి పనిచేయాలని SC పేర్కొంది.


