News July 1, 2024
ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలు అసాధ్యం: CBSE

ప్రస్తుత అకడమిక్ షెడ్యూల్ ప్రకారం 10, 12వ తరగతి విద్యార్థులకు ఏడాదికి 2సార్లు బోర్డు ఎగ్జామ్స్ అసాధ్యమని CBSE తెలిపింది. ఏడాదికి 2సార్లు పరీక్షలు పెట్టి, ఉత్తమ మార్కులనే పరిగణనలోకి తీసుకోవాలని జాతీయ విద్యా విధానం 2020కి అనుగుణంగా విద్యాశాఖ AUGలో సిఫార్సు చేసింది. ఈ మేరకు CBSE ప్రణాళికలు రూపొందించాలని సూచించింది. దీంతో పాఠశాలల ప్రిన్సిపల్స్‌తో చర్చించిన CBSE ప్రస్తుతం ఈ విధానం అసాధ్యమని తెలిపింది.
Similar News
News April 18, 2026
బిల్లుపై కేంద్రం Vs ప్రతిపక్షాలు.. మీ అభిప్రాయమేంటి?

131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంపై ప్రజల మధ్య ఆసక్తికర చర్చ జరుగుతోంది. మహిళలకు మంచి చేయాలనుకున్న కేంద్రం.. పాత రిజర్వేషన్ బిల్లునే పెట్టాల్సిందని, దానికి డీలిమిటేషన్‌ను లింక్ చేయడం ఎందుకని కొందరు ప్రశ్నిస్తున్నారు. డీలిమిటేషన్ వల్ల అన్ని రాష్ట్రాలకు సమన్యాయం జరుగుతుందని, ప్రతిపక్షాలకు మహిళల పట్ల గౌరవం లేకనే ఉమెన్ బిల్లును వ్యతిరేకించాయని మరికొందరు అంటున్నారు. బిల్లుపై మీ ఒపీనియన్?
News April 18, 2026
ప్రతిపక్షాలపై PM మోదీ ఆగ్రహం

కేంద్ర క్యాబినెట్ భేటీలో ప్రధాని మోదీ సీరియస్ కామెంట్స్ చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించి విపక్షాలు క్షమించరాని తప్పు చేశాయని మండిపడ్డారు. తప్పకుండా శిక్ష అనుభవిస్తాయని, మహిళలకు ఆ పార్టీలు సమాధానం చెప్పాలన్నారు. మరోవైపు మహిళా బిల్లును అడ్డుకోవడం ఘోర పాపమని, పైగా సంబరాలు చేసుకోవడం ఏంటని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ప్రశ్నించారు.
News April 18, 2026
పిల్లలతో నయన్, విఘ్నేశ్ క్యూట్ పిక్స్

లేడీ సూపర్ స్టార్ నయనతార, దర్శకుడు విఘ్నేశ్ శివన్ తమ కవల పిల్లలతో కలిసి దిగిన క్యూట్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తమ ఖాళీ సమయంలో ఉయిర్, ఉలగ్‌లతో ఈ జంట సరదాగా గడిపారు. తమ చిన్నారుల అల్లరికి సంబంధించిన చిత్రాలను షేర్ చేయగా.. అభిమానులు ఫిదా అవుతున్నారు. సెలబ్రిటీ పేరెంట్స్‌గా వారు పంచుకున్న ఈ మధుర క్షణాలు ట్రెండింగ్‌లో నిలిచాయి.


