News July 1, 2024

జూన్‌లో అధిక వర్షపాతం.. జులైలోనూ సమృద్ధిగానే!

image

AP: జూన్‌లో సాధారణ వర్షపాతం 91.2MM కాగా 143.7MM నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. శ్రీసత్యసాయి జిల్లాలో అత్యధికంగా 180% వర్షపాతం కురవగా, ఆ తర్వాత అనంతపురం(177%) నిలిచినట్లు తెలిపింది. నైరుతి రుతుపవనాల కారణంగా రాయలసీమలోని 8 జిల్లాలు, అనకాపల్లి, నెల్లూరు జిల్లాల్లో అధిక వర్షపాతం, మిగిలిన జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైనట్లు పేర్కొంది. ఈనెలలోనూ సమృద్ధిగానే వానలు కురుస్తాయని అంచనా వేసింది.

Similar News

News July 5, 2024

BREAKING: ‘నీట్’ రద్దు చేయలేం: కేంద్రం

image

నీట్ పరీక్షలో భారీ స్థాయిలో అక్రమాలు జరిగినట్లు ఆధారాలు లేవని కేంద్రం తెలిపింది. సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లకు సమాధానంగా అఫిడవిట్ వేసింది. ‘పరీక్షను రద్దు చేయాల్సిన అవసరం లేదు. అలా చేస్తే నిజాయితీగా ఎగ్జామ్ రాసిన లక్షలాది మంది విద్యార్థులకు నష్టం కలుగుతుంది. పారదర్శకంగా పోటీ పరీక్షల నిర్వహణకు కట్టుబడి ఉన్నాం. నీట్ లీకేజీలో నిందితులను అరెస్ట్ చేశాం. CBI దర్యాప్తునకు ఆదేశించాం’ అని పేర్కొంది.

News July 5, 2024

BREAKING: రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా సుదర్శన్ రెడ్డి

image

TG: రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా సుదర్శన్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. సుదర్శన్ రెడ్డి ప్రస్తుతం జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు. ప్రస్తుత సీఈఓ వికాస్‌రాజ్‌ను ఎన్నికల సంఘం రిలీవ్ చేసింది.

News July 5, 2024

చంద్రబాబు, రేవంత్ భేటీ.. ముహూర్తం ఫిక్స్

image

తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డిల భేటీకి ముహూర్తం ఖరారైంది. రేపు సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ ప్రజాభవన్‌లో ఇరువురు సమావేశం కానున్నారు. విభజన చట్టంలోని పెండింగ్ అంశాలపై చర్చించనున్నారు. 9వ షెడ్యూల్, 10వ షెడ్యూల్‌లోని సంస్థల పంపిణీ, విద్యుత్ సంస్థలపై ప్రధానంగా చర్చ జరగనుంది.